Suryaa.co.in

Andhra Pradesh

వంద మందికి పైగా తణుకు వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరిక

తెలుగుదేశం పార్టీ నాయకులు తణుకు మాజీ శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సమక్షంలో తణుకు రూరల్‌ మండలం తేతలి గ్రామం, ఇరగవరం మండలం సూరంపూడి గ్రామాలకు చెందిన 100 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నారా లోకేష్‌ మాట్లాడుతూ… అవినీతి, అరాచక విధానాలతో వైసీపీ పతనం మొదలైందని, పెద్ద ఎత్తున వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో మట్టా వెంకట్‌, మట్టా నాగేశ్వరరావు, కట్టా శ్రీరాంమూర్తి, భూపతిరాజు, వెంకటరామరాజు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE