Suryaa.co.in

Political News

పెళ్ళికి వెళ్ళి పెట్టుబడులు తెచ్చిన నాయుడు బాబు!

– జగన్ ‘గిఫ్ట్’ గురించేంటో?

ఆ మధ్య అనంత అంబానీ పెళ్ళికి లోకేశ్ వెళ్ళాడు. పనిలో పనిగా ముంబై పారిశ్రామిక వేత్తల నుండి విదేశాల నుండి వచ్చిన అతిథులను కూడా అంబానీ లెక్కన పలకరించారు లోకేశ్. ముహూర్తానికి చంద్రబాబు వెళ్ళడం వీడ్కోలు తీసుకొంటే కారు వద్దకు అంబానీ వచ్చి సాగనంపడం చూశాం.
పరిమల్ నత్వానీకి జగన్ గారి ‘స్పెషల్ గిఫ్ట్’ – రాజ్యసభ సీటు!
అయినా అంబానీ వెడ్డింగ్ కార్డు ఇచ్చారో లేదో తెలియదు. ఇచ్చి వుంటే వెళ్లి బొంబాయి కబుర్లు చెప్పేవాడు జగన్. జగన్ మొహం చూసి పెట్టుబడులు పెట్టడానికి రిలయన్స్ కూడా రాలేదు.

ప్రకాశం పోటెత్తి పులకరించింది!
పీసీ మండలం దివాకరపల్లి సమీపంలో నేడు కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంటుకు శంకుస్థాపన చేయడానికి నాయుడి గారి అబ్బాయి వస్తే జనం బ్రహ్మరథం పట్టారు.
రూ.65 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. పెట్టుబడులు ఊరికే రాలేదమ్మా.. ఫ్యామిలీ ఫ్యామిలీ పెళ్లిళ్లకు వెళ్లి అక్షింతలు వేస్తే వస్తాయి.
డెడ్బాడీ ఆనంద్ కొట్టిన దెబ్బతో ఐదేళ్లు వృధా అయ్యాయి. అభివృద్ధిని చూడడానికి జనం పోటెత్తి వస్తున్నారు.

– ( బాబు భూమా)

LEAVE A RESPONSE