తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ఘనంగా నారా బ్రహ్మణి జన్మదినోత్సవ వేడుకలు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి సతీమణి నారా బ్రహ్మణి జన్మదినోత్సవం సందర్భంగా గురువారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి కె.ఎస్ జవహార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో తెలుగుదేశం పార్టి జాతీయ కార్యాలయ రిసెప్షన్ కమిటీ ఇన్‌ఛార్జ్ హాజి షేక్ హసన్ బాష, సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టి ప్రచార కార్యదర్శి సామకోటి ఆదినారాయణ పాల్గొని కేక్ కట్ చేసి నారా బ్రహ్మణి కి శుబాభినందనలు తెలిపారు.

యువవ్యాపారవేత్తగా యువతకు మార్గదర్శిగా నిలిచిన తీరు హర్షణీయం. నారా వారి వెలుగైన బ్రహ్మణి ఎల్లపుడూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టి బీసీ సెల్ ఉపాధ్యక్షులు కె. పార్థసారధి, అమవరావతి దళిత జేఎసి నాయకులు పులి చిన్న, తెలుగుదేశం యువనాయకులు వల్లూరి కిరణ్ మరియు నేతలు పేరయ్య, వర్ల వికాస్, పుట్టపర్తి నాగరాజు, కార్యకర్తలు తదితరులు పాల్గొని నారా బ్రహ్మణి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply