టీడీపీ కార్యాలయంలో నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు

టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మనువడు నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. అనంతరం నేతలు మాట్లాడుతూ… దేవాన్ష్ భవిష్యత్తులో ఉన్నత స్ధాయికి ఎదగాలని ఆకాక్షించారు. దేవాన్ష్ అంటే చంద్రబాబు నాయుడుకి, బాలకృష్ణకి ఎంతో ఇష్టమన్నారు. ప్రతి ఏటా దేవాన్ష్ పుట్టిన రోజు సంధర్బంగా నారా లోకేశ్ దంపతులు తిరుమలలో అన్నదానం చేయటం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ,రాష్ట్ర అధికార ప్రతినిధులు నాగూల్ మీరా, పిల్లి మాణిక్యరావు, పాతర్ల రమేష్, టీటీడీ బోర్డు మాజీ మెంబర్ ఏవీ రమణ, పార్టీ కేంద్ర కార్యాలయ రిసెష్పన్ ఇంచార్జ్ హజీ హసన్ భాషా, ఏఏ రావు, మునిరత్నం నాయుడు, ఉయ్యూరు వెంకటేశ్వరరావు, బొల్లా పిచ్చయ్య, షేక్ సిద్దా, నాని, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply