అంబేద్కర్ ఆలోచనలు అమలు చేస్తున్న నరేంద్ర మోడీ

– దళితుల ను మోసం చేస్తున్న జగన్
– స్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్ సింగ్ ఆర్యా

విజయవాడ…. అంబేద్కర్ ఆలోచనలు అమలు చేస్తున్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాత్రమే… అంబేద్కర్ ని ఎన్నికల లో ఓడించి ధగా చేసింది కాంగ్రెస్ అని ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్ సింగ్ ఆర్యా ఆరోపించారు.

విజయవాడ లో దళిత ఆత్మీయ సభ లో ముఖ్య అతిథిగా హాజరైన లాల్ సింగ్ ఆర్యా మాట్లాడుతూ 370ఆర్టికల్ ను రద్దు చేసి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
మూడు వ సారి ప్రధానమంత్రి ని చేయాలని పిలుపునిచ్చారు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్ సభకు అద్యక్షత వహించారు.

కేంద్ర మంత్రి నారాయణ స్వామి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు.టిడ్కో ఇళ్ళు విషయాన్ని ప్రస్తావిస్తూ జగన్ అవినీతి ని ఎండగట్టారు.రాష్ట్రంలో ఇస్తున్న స్కాలర్ షిప్ లు 60శాతం బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదే.

జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి ఈ ముఖ్య మంత్రి అవసరం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం లో అవినీతి పరాకాష్ట కు చేరుకుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ ..ఎందరో మహానుభావులు త్యాగ ఫలితమే కేంద్రం లో 303 స్థానాలు సాధించాం.కార్యకర్తల కష్ఠఫలితం గా పార్టీ బలోపేతం అయింది. ఈ అవినీతి ప్రభుత్వం అవసరం లేదు. వచ్చే ఎన్నికల్లో బిజెపి ని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రమౌళి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రాశివన్నారాయణ, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్, , ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి శంభునాద్ తొండియా, బిజెపి నేతలు పార్థసారథి, పాతూరి నాగభూషణం,విక్రమ్ కిషోర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply