అల్లూరి సీతారామరాజు మన్యం విప్లవాన్ని ఆనాటి కాంగ్రెస్ నాయకులు చులకనగా మాట్లాడేవారు అల్లూరి సీతారామరాజును ఒక దోపిడీ ( పిత్తూరి )దారుడిగా అభివర్ణించారు వామపక్ష మేధావులు, రచయితలు కూడా ప్రారంభంలో అల్లూరి సాయుధ తిరుగుబాటును పట్టించుకోలేదు.
భగత్ సింగ్ కు ఇచ్చినంత ప్రాధాన్యతలో పదో వంతు కూడా వారు అల్లూరికి ఇవ్వలేదుఅయితే నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాత్రం అల్లూరిని గొప్ప వ్యక్తిగా భావించారు. తదనంతర కాలంలో సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ పై యుద్ధం ప్రకటించడానికి స్ఫూర్తినిచ్చింది అల్లూరి సీతారామరాజు అని రతన్ ఘోష్ అనే చరిత్రకారుడు అభిప్రాయపడ్డాడు.
అల్లూరి సీతారామరాజుకు ఆయుర్వేద వైద్యం తో పాటు హస్త సాముద్రికం ,జోస్యం ,గుర్రపు స్వారీ కూడా వచ్చు. పశువులను ఆయన తేలికగా మచ్చిక చేసుకునేవారు. ఆనాటి మన్యం ప్రజలు అల్లూరిని శ్రీరాముడి అవతారంగా భావించి ఆరాధించారు. అల్లూరికి అద్భుతమైన వాగ్దాటి ఉంది ఆయన ప్రసంగాలను వందలాదిమంది ఆసక్తిగా వినేవారు.
1922లోనే అల్లూరిని పట్టించిన వారికి పదివేల రూపాయల బహుమతిస్తామని బ్రిటిష్ వారు ప్రకటించారు. మన్యం తిరుగుబాటును అణిచివేయడానికి బ్రిటిష్ వారు వందలాది మంది సైనికులను వినియోగించాల్సి వచ్చింది.ఈ అణచివేతకు వారికి అప్పట్లో సుమారు 40 లక్షల రూపాయల వ్యయం అయింది.
1925లో రాజమండ్రి కి చెందిన భమిడిపాటి సత్యనారాయణ గారు అల్లూరి సీతారామరాజు ప్రశంస అనే పుస్తకంలో ఆయనను గొప్ప జాతీయ వాదిగా, పురుషరత్నంగా అభివర్ణించారు.
– కృష్ణంరాజు
జర్నలిస్ట్