– యువతరం ఈ దిశగా చొరవ తీసుకోవాలి
– త్రిపురనేని హనుమాన్ చౌదరికి ప్రజ్ఞా భారతి జీవన సాఫల్య పురస్కారం
– మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు
హైదరాబాద్: త్రిపురనేని హనుమాన్ చౌదరికి ప్రజ్ఞా భారతి జీవన సాఫల్య పురస్కారం అందజేయటం సంతోషకరం. శనివారం హైదరాబాద్ కవాడిగూడ మారియట్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం సంతోషంగా ఉంది. ప్రజ్ఞా పురస్కారాలను అందుకున్న రాకా సుధాకర్ కి, ముదిగొండ శివప్రసాద్ కి ప్రత్యేక అభినందనలు.
త్రిపురనేని హనుమాన్ చౌదరి కి “పంచ నవతి (95)” పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన హనుమాన్ చౌదరి , భారత టెలికాం రంగానికి అందించిన సేవలు నిరుపమానమైనవి. అంతకు మించి ప్రజ్ఞాభారతి ద్వారా సమాజానికి అందిస్తున్న సేవలు మహోన్నతమైనవి.
ప్రజ్ఞాభారతి సంస్థ… సమాజంలో సానుకూల ఆలోచనల ఉన్న మేధావులను, విద్యావంతులను ఒక చోటకు చేర్చి.. అర్థవంతమైన మార్గాల్లో సమాజాన్ని ముందుకు తీసుకుపోవడం ముదావహం. జాతీయవాద ఆలోచనలను సమాజంలోకి మరింత ముందుకు తీసుకుపోవడానికి కృషి జరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా యువతరం ఈ దిశగా చొరవ తీసుకోవాలి.