-రాష్ట్ర టీఎన్‌టీయుసి నేత నవీన్ కుమార్ రెడ్డి
తిరుపతి నగరపాలక సంస్థ అధికారుల పర్యవేక్షణలో స్మార్ట్ సిటీ నిధులు సుమారు 12 కోట్ల రూపాయలతో తుడా మైదానంలో అలాగే శ్రీనివాసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో క్రీడాకారుల కోసం ప్రారంభించిన పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి!
స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనుల ఆలస్యానికి కారణం “అధికారుల నిర్లక్ష్యమా పాలకుల వైఫల్యమా కాంట్రాక్టర్ బాధ్యతా రాహిత్యమా”? ప్రజలకు సమాధానం చెప్పాలి! స్పోర్ట్స్ కాంప్లెక్స్ ల అభివృద్ధి నిర్మాణం కోసం సుమారు 12 కోట్ల రూపాయలు వెచ్చించిన అధికారులు సకాలంలో పనులు పూర్తి చేయకపోవడంతో తుడా మైదానం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది!
స్మార్ట్ సిటీ నిధులను తిరుపతి రోడ్ల అభివృద్ధికి ఖర్చు చేసి ఉంటే కనీసం పాదచారులకు వాహన చోదకులకు తిప్పలు తప్పేమి! స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణాలు 9 నెలల గడువులో పూర్తి చేయాలని కాంట్రాక్టర్ తో ఒప్పందం కుదుర్చుకొని తర్వాత మళ్లీ గడువు పెంచినా పనులలో పురోభివృద్ధి జరగకపోవడంలోని ఆంతర్యం ఏమిటి!స్మార్ట్ సిటీ నిధులతో ప్రారంభించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులను త్వరితగతిన పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని నగరపాలక సంస్థ అధికారులను పాలకులను డిమాండ్ చేస్తున్నాను.