రేవంత్ సెక్యూరిటీలో కొత్త ముఖాలు?

– పాత సీఎం వద్ద పనిచేసిన వారి తొలగింపు?
– సమాచారం లీకవుతోందన్న అనుమానం?
(బాబు)

రేవంత్ రెడ్డికి సీఎం పదవి దక్కింది.తనదైన మార్క్ ఎత్తుగడలతో పాలనాపరమైన మార్పుల్లో మోత మోగిస్తున్నారు.ఇప్పుడు రేవంత్ భద్రతపై పనిచేస్తున్న మొత్తం సెక్యూరిటీని మార్పు చేస్తున్నట్లువార్తలు వస్తున్నాయి.మొత్తం సిఎం సెక్యూరిటీ టీమ్‌ను మార్చాలని ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆదేశించినట్లు తెలుస్తోంది.

నివేదికల ప్రకారం,ఇప్పటికే ఉన్న ఈ భద్రతా బృందం గతంలో కేసీఆర్‌తో కలిసి పనిచేసింది,ఈ భద్రతా బృందం ద్వారా రేవంత్ క్యాంపు నుండి కేసీఆర్‌కు సమాచారం లీకేజీ అవుతుందనే అనుమానం ఉంది.భద్రతా బృందాన్ని మార్పు వెనుక ఉన్న కారణానికి సంబంధించి సోషల్ మీడియా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

గతంలో కేసీఆర్‌తో కలిసి పనిచేసిన ప్రతి ఒక్క సెక్యూరిటీ ఆఫీసర్‌ను తొలగించి,ఇకపై వారి స్థానంలో కొత్త వారిని రేవంత్ సెక్యూరిటీ కోసం నియమించాలనేది ప్లాన్‌గా తెలుస్తోంది.ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ నుండి ఈ ఆర్డర్ వచ్చినందున,ముఖ్యమంత్రి కార్యాలయం మార్పులను తప్పకుండా అమలు చేయాల్సి ఉంటుంది.

Leave a Reply