– కడప కోర్టు ఆదేశం
కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఎవరూ మాట్లాడొద్దని కడప న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వికేక కుమార్తె సునీత, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్, నారా లోకేశ్, పురందేశ్వరిని కూడా వివేకా హత్యను ఎక్కడా ప్రస్తావించొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ వివేకా హత్య ప్రస్తావించడాన్ని సవాలు చేస్తూ వైసీపీ నేత సురేష్‌బాబు కడప కోర్టును ఆశ్రయించారు.