పంచదార్ల.. ఫణిగిరి పర్వతం!

విశాఖపట్టణానికి 50 కిమీ దూరంలో ఉండే ఈ పుణ్యక్షేత్రం చూడటానికి ఆకుపచ్చటి వనంలా ఉంటుంది. మీరెప్పుడైనా విశాఖపట్టణానికి వెళితే అక్కడి నుంచి గాజువాక యలమంచిలి దారిలో వెళుతుంటే పాము పాకుతున్నట్టుగా ఒక కొండ కనిపిస్తుంది. దాని పేరు ఫణిగిరి పర్వతం.
ఇక్కడ భూగర్భం నుంచి అయిదు ధారలుగా జలం పొంగుతూ ఉంటుంది.
అందుకే ఇది ‘పంచధారలు’ అయ్యి కాలక్రమేణా ‘పంచదార్ల’గా స్థిరపడింది.
పంచదార్ల ఒకప్పుడు వర్ధమాన క్షేత్రమట.
పంచదార్ల (దీని అసలు పేరు ధారపాలెం)..
ఈ ఆలయం క్రీ.శ 13 వ, తూర్పు చాళుక్యులకు చెందిన అద్భుతమైన శిల్పాలతో సమృద్ధిగా ఉంది.
శివుని పాదాలకు మహత్యం చాలా ఉందని ప్రజలు నమ్ముతారు.
ఆ పాదాల క్రింద నంది విగ్రహం ఉంది.
ఆ పాదాల చుట్టూ శివ గణాలు కనిపిస్తాయి. ఇక్కడ ఐదు ప్రదేశాలు అనగా థారలు నుండి నీరు వస్తుంది, అది ఎక్కడి నుండి వస్తున్నదో ఇప్పటికీ తెలియదు. ఈ నీరు చివరకు ఆలయానికి సమీపం లో ఉన్న థారల వద్దకు చేరుకుంటుంది, ఐదు థారలు నుండి నీరు విడుదల అవుతుంది కాబట్టి దాని పేరు పంచథార్ల అని పేరు వచ్చింది.
ఈ నీరు పాపాలను కడిగివేస్తుందని భక్తులు నమ్ముతారు
ఇక్కడ స్వయం భూయుక్తమైన లింగం ఉండేదని కాల గతిలో అది మరుగున పడగా నారదుని సూచన మేరకు యమధర్మరాజు తన కుష్టువ్యాధి నివారణ నిమిత్తం మరొక వర్ధమాన లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించేడని ,యమధర్మరాజు చేత పునః ప్రతిస్టించబడిన లింగం కనుక ధర్మలింగేశ్వర ఆలయం అని పేరు వచ్చినట్టు స్థల పురాణం.
ఈ క్షేత్రంలోని పంచధారలు అవిశ్రాంతంగా ప్రవహిస్తూనే వుంటాయి. గనుక వీటిని ఆకాశధారలు అని కూడా పిలుస్తారు.
ఈ నీటిలో గంధకం శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్నానాలు చేస్తే అనేక రుగ్మతలు దూరమవుతాయని భక్తుల నమ్మకం.
ఇక్కడకు వచ్చే పర్యాటకులకు మొదట ‘రాధామాధవస్వామి’ ఆలయం స్వాగతం చెబుతుంది.
దీనిని క్షేత్రపాలక దేవళం’ అని కూడా పిలుస్తారు. ఇక్కడే పంచదారలు ఉన్నాయి.
ఈ ధారలతో పాటు సింహగిరి నరసింహస్వామి వారి పాదాలు కూడా ఇక్కడ వెలశాయని భక్తులు చెప్పుకుంటారు.
శ్రీ లక్ష్మీనరసింహస్వామి మొదట పాదాలు మోపింది ఇక్కడేనట. అయితే ధర్మలింగేశ్వరుడి అభ్యర్ధన మేరకు ఇక్కడ స్థిరపడకుండా సింహాచలంలో స్థిరపడ్డాడట ఆ స్వామి.
పౌర్ణమినాడు ఈ ఆలయంలో స్వామివారికి కళ్యాణము నిర్వహిస్తారు. అప్పుడే కాకుండా విజయదశమి,దీపావళి పండుగలనాడు కూడా ప్రజలు తండోపతండాలుగా పుణ్యస్నానాలు దర్శనాలు చేసుకుంటూ వుంటారు.
అలాగే 1422లో నృసింహదేవుడి భార్య వీరాంబచే నిర్మించబడినట్టు చెప్పుకుంటున్న నృత్య మండపములోని చెక్కడాలు ఆనాటి శిల్ప సౌందర్యానికి కొలమానంగా ఉన్నాయి.
ఈ ఆలయంలో తరచుగా ఒక శ్వేతనాగు దర్శనమిస్తుందని భక్తులు చెప్పుకుంటారు.
ఇది చాలా శుభసూచకంగా భావిస్తారు.
ఆలయానికి దక్షిణ దిశలో తటాకం ఉంది. నీటి ధారలన్నీ దీనిలో కలుస్తాయి.
ఇక్కడ ఆలయ సమూహంలో విశ్వేశ్వరస్వామి ఆలయం, అనేక లింగాకృతులు, దేవతామూర్తుల విగ్రహాలు, నందీశ్వర విగ్రహాలు, శిథిల శిల్పాలు కనిపిస్తాయి.
కార్తీక మాసం, శివరాత్రి, విజయదశమి రోజుల్లో ఈ పుణ్యక్షేత్రం భక్తులతో కళకళ లాడుతుంది
అనకాపల్లి నుండి 25 కి. మీ. దూరంలో ఉంది.

– బోయె వెంకటరామ్‌

Leave a Reply