టీడీపీని లేకుండా చేయడమే పవన్, జగన్‌ల కుట్ర: హర్షకుమార్

Spread the love

రాజమండ్రి : మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కులం ప్రాధాన్యత లేదని చెప్పి.. ఇప్పుడు కులాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్, సీఎం జగన్, బీజేపీలు బృహత్తర ప్రణాళికతో ముందుకు వెళుతున్నారన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌లను పక్కన పెట్టేందుకు యత్నిస్తున్నారని, ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీని లేకుండా చేయడమే పవన్, సీఎం జగన్‌ల కుట్రని హర్షకుమార్ వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ పర్యటనకు ఒప్పుకోమని చెప్పిన ప్రభుత్వమే హైప్ సృష్టిస్తోందని, జనసేన కార్యకర్తలకు ఆవేశం వచ్చిన తర్వాత ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందని హర్షకుమార్ ఆరోపించారు. నిజంగా పవన్‌కు చిత్తశుద్ది ఉంటే 10 రోజులు తూర్పుగోదావరి జిల్లాలోనే ఉండి రోడ్లు బాగుచేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నిర్లక్ష్యం చేస్తున్నాయని హర్షకుమార్ విమర్శించారు.

Leave a Reply