Suryaa.co.in

Features

ఎప్పుడైనా ప్రజలే ఓడిపోతారు..పెట్టుబడి దారులు గెలుస్తారు!

పేకాట, గుర్రపు పందేలు ఎలాంటి జూదాలో ఈ క్రికెట్ తదితర ఆటల పోటీలన్నీ అలాంటి జూదా లే.. అన్ని జూదాల లానే ఈ ఆటల జూదాలు కుడా జనాలని కట్టి పడేసి ఉంచుతాయని, వారిని అలా కట్టి పడేసి ఉంచడమే తమకు క్షేమమని, దోపిడీ ప్రభుత్వాలకు స్పష్టం గానే తెలుసు. అందుకే ప్రభుత్వాలు జూదాల సంస్కృతిని ఓక రాజకీయ ఎత్తుగడగా అనుసరిస్తూ ఉన్నాయి. సమస్యల నుంచి ప్రజల దృష్టి పక్కకి తప్పించటానికి ఈ ఆటల ఆర్భాటాలు చక్కగా ఉపయోగ పడుతాయి.

దేశానికి ప్రతిష్ఠ అనేది, ఒక మనిషి బరువు ఎత్తితేనో లేదా మరొకరు మరొక ఫీట్ చేస్తేనో.. లేక మరొక ఆటలో ఒకరు బంతి విసిరితేనో, కొడితేనో, పరుగులు తీస్తేనో లేదా బంతిని పట్టుకుంటేనో రాదు..

కానీ.. ఆ దేశంలో ప్రజల జీవనం సరైన సౌకర్యాలతో ఉన్నప్పుడు, దేశ జనాభా సంతోషంగా ఉన్నప్పుడు, పేదరికం పోయి నప్పుడు, హత్యలు దోపిడీలు లేని విలువైన సమాజం ఏర్పడినప్పుడు వస్తుంది. మన దేశ పరువు బంతి లోనో బాట్ లోనో ఉందన్న రకంగా.. పెట్టుబడి దారులు, ప్రభుత్వం ఆడుతున్న ఆటలో గెలుపు ఎప్పుడూ వారిదే ఔతుంది.. అయితే, ఓటమి మాత్రం ఎపుడూ ప్రజలదే ఔతుంది..

– రంగనాయకమ్మ

LEAVE A RESPONSE