Suryaa.co.in

Andhra Pradesh

నందికొట్కూరు ప్రజలు ఆలోచన చేయాలి

-మంచి వాడు కావాలా..గూండా కావాలా?
-డబ్బు తీసుకుని ఓట్లు వేస్తామా?

-58 సార్లు తిరిగితే ఒక్కసారి కలిశారట
-ఇదేనా నాయకుడికిచ్చే గుర్తింపు?
-బహిరంగసభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కర్నూలు జిల్లా నందికొట్కూరులో భారీ బహిరంగ సభలో పీసీసీ చీఫ్‌, కడప ఎంపీ అభ్యర్థి వై.ఎస్‌.షర్మిలారెడ్డి మాట్లాడారు. ఆర్థర్‌ను ఉద్యోగిగా కాదు…నాయకుడిగా ఉండాలని వైఎస్సార్‌ చెప్పారు. నాయకుడిని చేశారు..ఇప్పుడు ఆయనను జగన్‌ నిర్లక్ష్యం చేసి పక్కన పెట్టారు. రాజకీయాల మీద విసుగు చెంది ఆర్థర్‌ నా దగ్గరకు వచ్చా డు. ఈ రాజకీయాలు నాతో కాదమ్మా అని చెప్పాడు. లేదు నాయకుడుగా ఉండాలని చెప్పాను. రాజకీయం మొత్తం డబ్బు మయం అయిందమ్మ అని బాధపడ్డాడు.

నందికొట్కూరు ప్రజలు ఆలోచన చేయాలి. డబ్బు తీసుకొని మనం ఓటు వేస్తామా? మంచి నాయకులను మనం వదులుకుంటామా? మంచి నాయకుడు ఆర్థర్‌ కావాలా? మాఫియాలు చేసే వైసీపీ నాయకులు కావాలా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఉండి జగన్‌ కోసం 58 సార్లు అపాయింట్‌మెంట్‌ అడిగితే ఒక్క సారి ఇచ్చాడట. ఇదేనా నాయకులకు ఇచ్చే గుర్తింపు? అని ప్రశ్నించారు. హంద్రీనీవా..శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌తో ఎత్తిపోతల పథకాలు కడితే 80 వేలు ఎకరాలు సాగు నీరు వచ్చేది. అలగనూరు రిజర్వాయర్‌ గండి పడితే కనీసం గండి కూడా పూడ్చలేదు. ప్రతి ఏటా 30 వేల ఎకరాలు ఎండిపోతుంటే గుండె తరుక్కుపోయింది అని ఆర్థర్‌ బాధపడ్డాడు.

రైతులు అల్లాడిపోతుంటే చూడలేకపోయాడు. ఈరోజు వరకు నందికొట్కూరులో తాగడానికి గుక్కెడు నీళ్లు లేవు..ఇదేనా అభివృద్ధి అంటూ మండిపడ్డారు. ఆర్థర్‌ లాంటి నాయకుడు కాకుం డా…గూండాలను గెలిపిద్దామా? నందికొట్కూరు ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. కర్నూల్‌లో న్యాయ రాజధాని అని మోసం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలో వస్తే 10 ఏళ్లు ప్రత్యేక హోదా, మొదటి సంతకం 2.25 లక్షల ఉద్యోగాల మీద పెడతాం, మహిళలకు ఏడాదికి లక్ష ఇస్తామని తెలిపారు.

LEAVE A RESPONSE