Suryaa.co.in

Andhra Pradesh

పింగళి స్పూర్తి అజరామరం

-దేశానికే జెండా అందించిన సమతావాది మన రాష్ట్రం వారు కావడం గర్వకారణం
– తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా పింగళి వెంకయ్య జయంతి వేడుకలు

ఒక జాతికీ, ఆ జాతి నిర్వహించే ఉద్యమానికీ ఒక పతాకం అవసరని గుర్తించి ఆ దిశగా అందర్నీ ఒప్పించి దేశానికి మువ్వన్నెల జెండా అందించిన ఘనత పింగళి వెంకయ్యది. స్థల కాలాలకు సంబంధం లేకుండా అందరినీ ఉత్తేజపరిచే జెండా రూపొందించాలన్న గాంధీజీ సూచనలతో త్రివర్ణ పతాకాన్ని రూపొందించడంలో పింగళి వెంకయ్య కృషి, కష్టం అనిర్వచనీయం. అటువంటి మహనీయుడి స్పూర్తితో మనం మన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కోడూరు అఖిల్ సహా పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

 

LEAVE A RESPONSE