Suryaa.co.in

Andhra Pradesh

ప్రధాని వయోశ్రీ యోజన పేద వృద్ధులకు ఆసరా

– రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు

విశాఖ : 100 సంవత్సరాలు 96 సంవత్సరాలు, 80 సంవత్సరాలు పైబడిన అనేకమంది వయో శ్రీ లు (వృద్ధులు) ముఖ్యంగా వినికిడి లోపంతో బాధపడుతున్నారని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. ఈ పథకంలో వినికిడి యంత్రాలు కళ్ళజోళ్ళు, కృత్రిమ దంతాలు, వీల్చైర్లు ,నడుము బెల్టులు ,ఊత కర్రలు ,మొదలగునవి వారి అవసరం నిమిత్తము పేరు నమోదు చేసుకొని, అతి తొందరలో ఇంకొక కార్యక్రమం ద్వారా అందజేయడం జరుగుతుందని అన్నారు .

ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ఈ పథకము గురించి ప్రజలందరికీ తెలిజేయవలసిన అవసరము ఉన్నది, కాబట్టి మీడియా మిత్రులు, జిల్లా అధికారుల సహకారం కావాలని ఈ పథకం గురించి వివరంగా తెలియజేయాలని కోరారు. ఫిబ్రవరి 27 వతేది నుంచి మార్చే 5 వ వరకు వయో శ్రీ యోజన పథకంను నగరములో ప్రతి నియోజకవర్గంలో నిర్వహిస్తామని వయో శ్రీ లు వినియోగించుకోవాలని కోరారు.

LEAVE A RESPONSE