ప్రజాగళం లో ప్రత్తిపాటి శరత్ బైక్ ర్యాలీ

బొప్పూడి ప్రజాగళం బహిరంగ సభకు యువత భారీసంఖ్యలో హాజరయ్యారు. ముఖ్యంగా చిలకలూరిపేట నుంచి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి శరత్ నేతృత్వంలో టీఎన్ఎస్ఎఫ్, తెలుగుయువత కార్యకర్తలు భారీ ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. శరత్ తాను కూడా ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తూ యువతను ఉత్సాహపరిచారు.

ముందుగా 9వ వార్డులోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బైక్ ర్యాలీని ప్రారంభించారు. శరత్ నేతృత్వంలో నిర్వహించిన బైక్ ర్యాలీ శ్రేణులను ఆద్యంతం ఉత్సాహపరిచింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఎన్‌ఆర్‌టీ, చౌత్రా, కళామందిర్, కేబీరోడ్, అడ్డరోడ్ సెంటర్ల మీదుగా సభాస్థలి వరకు ర్యాలీ కొనసాగింది. వెయ్యి ద్విచక్రవాహనాలపై కేరింతలు కొడుతూ… నవ్యాంధ్ర భవిష్యత్తుకు బాటలు వేసేందుకు తెలుగుదేశం కూటమికి ఓట్లు వేయాలని యువత దారిపొడవునా నినాదాలు చేశారు.

యువత జోష్‌ను చూసి దారివెంట మహిళలు, స్థానికులు విజయసంకేతం చూపారు. బైక్ ర్యాలీ విజయవంతం కావడంపై శరత్ సంతోషం వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహాన్ని ఎన్నికల వరకు కొనసాగించి సైకో జగన్ పాలనను సాగనంపుతామని శరత్ ప్రకటించారు.

Leave a Reply