– కఠిన చట్టం కోసం సుప్రీం కోర్టులో పిల్ వేయాలి
– జాతీయ మహిళా కమిషన్ కు వాసిరెడ్డి పద్మ లేఖ
విజయవాడ: సోషల్ మీడియాలో మహిళల పట్ల సాగుతున్న వికృత దాడిపై కఠిన చట్టం కోసం సుప్రీం కోర్టులో పిల్ వేయాలని జాతీయ మహిళా కమిషన్ ను రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు. ఈ మేరకు ఆమె కమిషన్కు ఒక లేఖ రాశారు.
రాష్ట్రంలో సీఎం, డిప్యుటీ సీఎం కుటుంబాలపై, మహిళా హోం మంత్రి, రాజకీయ పార్టీల మహిళా నేతలపై సోషల్ మీడియాలో విషం చిమ్ముతున్నారని, పసలేని చట్టాలతో ఈ సైకోల దాడి నుండి మహిళలను కాపాడలేమని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను రివ్యూ చేయాలని ఎన్సీడబ్ల్యు కు రాసిన లేఖలో వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. తక్షణమే జాతీయ మహిళా కమిషన్ సుప్రీం కోర్టులో పిల్ వేసి కఠినమైన చట్టం అమలుకు పూనుకోవాలని ఆమె కోరారు.