– ఆయుష్మాన్ భారత్ , విశ్వకర్మ యోజనను తెలంగాణలో అమలు చేయాలి
– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
హైదరాబాద్: తెలంగాణ టైగర్ ఆలే నరేంద్ర వర్థంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులర్పిస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ దేశం, ధర్మం, డెవలప్‌మెంట్ అంశాలతో పరిపాలన అందిస్తున్నారు. దేశంలో అత్యధిక కుటుంబాలు జీవిస్తున్నది ఎంఎస్‌ఎంఈ సెక్టార్ పై ఆధారపడే.. ఈ రంగమే జీడీపీలో ప్రధానపాత్ర పోషిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు మెన్నుముక లాంటిది ఎంఎస్‌ఎంఈ సెక్టార్.
ఎంఎస్‌ఎంఈ రంగంలో భాగంగా ఎలాంటి పూచీకత్తు లేకుండా ముద్ర లోన్లను ప్రవేశపెట్టారు. దేశంలో మోదీ ప్రభుత్వంలో 52 కోట్ల మంది చిన్న పారిశ్రామికవేత్తలకు రూ. 32 లక్షల కోట్లు సెబీ బ్యాంకు ద్వారా రుణాలు మంజూరు చేయడంతో కోట్లాది మంది ఉపాధి పొందడంతో పాటు మరికొంత మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగారు.
ఈ రుణాల్లో 55% మేర ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు లబ్ధి చేకూరింది. కాంగ్రెస్ పార్టీ 71 సంవత్సరాల పాలనలో ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూసింది. మోదీ మాత్రం శక్తీకరణ చేస్తున్నారు. ముద్ర లోన్ల ద్వారా 22-31% మైనారిటీ వర్గాలు లబ్ధి పొందాయి. బీజేపీ అంటే సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్.
కుల, మతాలకు అతీతంగా భారతీయులే ప్రథమంగా భావించేలా పాలన సాగుతోంది. ముద్రలోన్ల ద్వారా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. ఉదాహరణకు బుట్టలు అల్లడం, గన్నీ బ్యాగ్స్ తయారీ, ఇంటివద్దే వంటకాలు తయారీ, పండ్ల, కూరగాయల దుకాణాలు, ఎంబ్రాయిడరీ, బ్యూటీ పార్లర్లు మొదలైన రంగాల్లో ఎదుగుతున్నారు.
విశ్వకర్మ యోజనతో దేశవ్యాప్తంగా 18 సంప్రదాయ వృత్తుల వారిని ప్రోత్సహిస్తున్నారు. వారికి 15 రోజుల శిక్షణ, రూ. 15,000 విలువైన టూల్ కిట్, రూ. 1 లక్ష వరకు రుణ సబ్సిడీ లభిస్తోంది.
తెలంగాణలో 4 లక్షల మంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు 40 వేల మందికి శిక్షణ, టూల్ కిట్, రుణ సబ్సిడీ లభించింది. అయితే రెండున్నర లక్షల దరఖాస్తులపై వెరిఫికేషన్ చేపట్టకుండా, ఈ పథకం అమలు అడ్డుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం సైంధవుడిలా ప్రవర్తిస్తోంది.
కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ స్కీమ్, విశ్వకర్మ యోజనను తెలంగాణలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వక్ఫ్ సవరణ చట్టంతో ముస్లిం సామాజిక వర్గాల్లో విశ్వాసాన్ని పెంచారు.
వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లిం వర్గాల్లో విశ్వాసాన్ని పెంపొందించారు. ప్రతిపక్షాలు పార్లమెంటులో విఘాతం కలిగించేందుకు యత్నించినా, పస్మందా వర్గాలు, ముస్లిం మహిళలు మోదీకి మద్దతు పలికి నీరాజనం పలికారు.
దేశంలో 9, 40,000 వేల ఎకరాల వక్ఫ్ భూమిలో 75% కబ్జా అయ్యాయి. హైదరాబాదులో ప్రైవేట్ హాస్పిటల్స్, ఫంక్షన్ హాల్స్, మెడికల్ కాలేజీలు వక్ఫ్ బోర్డు యాజమాన్యాలు, మెంబర్లు, ముతావల్లీలు, బడా నేతలు చేతుల్లో ఉన్నాయి.
వక్ఫ్ బోర్డులో అధికంగా బడా నేతలు, వ్యాపారులు, కాంగ్రెస్ నాయకులు భూములు కబ్జా చేసినట్లు ఆరోపణలున్నాయి. ప్రపంచంలో వక్ఫ్ ఆస్తులు అత్యధికంగా భారతదేశంలోనే ఉన్నాయి. కానీ ఏటా రావాల్సిన కనీస రూ. 12,000 కోట్ల ఆదాయానికి బదులుగా కేవలం రూ. 163 కోట్లు మాత్రమే వస్తున్నాయి. అంటే దాదాపు 11 వేల కోట్లు వక్ప్ ఆస్తులను సిండికేట్ గా దండుకున్నది బోర్డు మెంబర్లు, బడా నేతలే.
ప్రపంచంలో వక్ఫ్ కు అత్యంత ఆస్తులు ఉన్నది భారత దేశంలోనే. సౌదీ అరేబియా, టర్కీ, ఇరాక్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియాలాంటి పెద్ద ముస్లిం దేశాల్లో కూడా భారతదేశంలో ఉన్నంత వక్ఫ్ ఆస్తులు ఎక్కడా లేవు.
2005 అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ సచార్ కమిటీ ముస్లింల ఆర్థిక, సామజిక, విద్య ఎదుగుదల విషయంలో అధ్యాయానికి ఏర్పాటు చేసిన కమిటీ. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం భారత దేశం మొత్తం లో కోర్టులకు పర్యవేక్షణకు అవకాశం లేని ఏకైక చట్టంగా వక్ప్ బోర్డును చేసింది. అందుకే, నరేంద్ర మోదీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది.
దీనివల్ల తమిళ నాడు లోని ఒక గ్రామం ( తిరుచునాతీరు ) మొత్తం వాక్జ్ ఆస్తి అని ప్రకటించారు. సూరత్ లోని మునిసిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ , ఆవరణ మొత్తం తమదేనని వక్ఫ్ ప్రకటించింది. సూరత్ లోని శివ శక్తి సొసైటీ లో రెండు ప్లాట్లు వక్ఫ్ వేనని ప్రకటించారు.
తిరుచానూరులో 600 ఎకరాలు, బెంగళూరు లో 600 ఎకరాలు, విజయపురి జిల్లా కర్ణాటకలో 1500 ఎకరాలు, కర్ణాటక దత్తపీట్ మందిర్ , కర్నాటక ఒక ఆలయానికి చెందిన 600 ఎకరాలు , కేరళ లోని క్రిస్టియన్ మిషనరీస్ ఆస్తులు.. ఇలా 2013 లో 9.4 లక్షల ఎకరాలు ఉన్న వక్ఫ్ ఆస్తులను వివిధ రాష్ట్రా లలో 36 లక్షల ఎకరాలు ప్రభుత్వ, ప్రైవేట్ భూమి వక్ఫ్ ఆస్తులు అని ప్రకటించి ఒక మహా లిటిగేషన్ అవతారమెత్తింది.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం. వక్ఫ్ బోర్డు పేరిట బడా నేతలు, మతావల్లీలు ఆస్తులను కబ్జా చేశారో.. వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది.