Suryaa.co.in

National

భారత్ కు తహవూర్ రాణా అప్పగింత

26/11 ముంబయి ఉగ్రదాడి పేలుళ్ల కేసులో నిందితుడు తహవూర్ రాణా ఈ రాత్రికి లేదా రేపు తెల్లవారుజామున విమానంలో భారత్ చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు అమెరికాలో ఉన్న చట్టపరమైన అవకాశాలన్నీ ముగిశాయి. దీంతో అధికారులు అతడిని భారత్ కు అప్పగించారు. ప్రస్తుతం అతడిని తీసుకుని భారతీయ అధికారుల బృందం, ప్రత్యేక విమానంలో ఇండియాకు తిరుగుపయనమైనట్లు సమాచారం. ఈ మేరకు పలు ఇంగ్లీష్ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

LEAVE A RESPONSE