మానసిక వికలాంగత అంటే బుద్ధి మాంద్యతే కాకుండా మానసిక ఇతర మానసిక అస్వస్తత, బుద్ధిమాంద్యం అంటే ఒక వ్యక్తి మానసికంగా అసంపూర్తిగా ఎదగడం లేదా ఎదుగుదల ఆగిపోవడంతో ప్రత్యేకంగా అతి తక్కువ తెలివితేటలు కలిగి ఉండటం. వికలాంగత గల వ్యక్తి అంటే ఒక వ్యక్తి 40 శాతానికి తక్కువ లేకుండా వైకల్యం కలిగి ఉన్నట్లుగా మెడికల్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం. అయితే మెడికల్ బోర్డు ప్రతినెల నిర్ణీత సమయాల్లో జిల్లా వైద్యశాల యందు సమావేశమై సర్టిఫికెట్లు ఉచితంగా అందజేస్తుంది.
ప్రతి జిల్లాలో ప్రభుత్వ పథకాలు అమలు పర్చే నిమిత్తం సహాయ సంచాలకుల కార్యాలయాలు పనిచేస్తున్నవి. వికలాంగుల సహకార సంస్థ కార్యకలాపాలు పదవిరీత్యా జాయింటు కలెక్టరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టగరుగా, సహాయ సంచాలకులు పదవిరీత్యా వికలాంగుల సహకార సంస్థ జిల్లా మేనేజరుగా వ్యవహరిస్తారు. మొత్తం మీద జిల్లా కలెక్టరు గారి అధికార పర్యవేక్షణలో వికలాంగు సంక్షేమం కొరకు నిర్దేశించబడిన పునరావాస కార్యక్రమాలు అమలుపరచబడుతుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో వికలాంగులు పునరావాసం మరియు అభివృద్ధి కొరకు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఈ విధంగా విభజించబడినవి.
మానసిక రోగులను గుర్తించి వారిని ఆసుపత్రులలో చేర్పించేందుకు ప్రణాళికలను మనోబంధు రుపొందిస్తున్నాము. మానసిక రుగ్మతలతో బాధపడుతూ నిరాశ్రయులుగా ఎవరైనా కనపడితే మనొబంధు దృష్టికి తీసుకు రండి. స్థానిక అధికారులు, వైద్యులు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు, పొలిసు సిబ్బంది సమన్వయంతో వారిని ఆస్పత్రిలో చేర్పిస్తాము. రాష్ట్రంలో నిరాశ్రయులుగా సంచరించే ఒక్క మానసిక రోగి కూడా లేకుండా అందరినీ ఆసుపత్రి లేదా షెల్టర్ హోమ్ లో చేర్పించే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం.
ఈ యజ్ఞంలో మాతో కలసి వచ్చే స్వచ్ఛంద సంస్థలు, స్వచ్ఛంద సేవకులు మా సెంట్రల్ ఆఫిసు నంబరు : 9989988912 సంప్రదించాలని కోరుతున్నాము. భారతీయులు కొంత మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేసింది , ఈ సంవత్సరం చివరినాటికి భారతదేశంలో సుమారు 20 శాతం మంది మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య లెక్కలను చూస్తే 56 మిలియన్ల భారతీయులు నిరాశతో బాధపడుతున్నారు, 38 మిలియన్ల మంది భారతీయులు ఆందోళన రుగ్మతలతో బాధపడుతున్నారు.
ప్రపంచంలోని అన్ని దేశాలలో ఆరోగ్యం, సామాజిక, మానవ హక్కులు, ఆర్థిక పరిణామాలపై గణనీయమైన ప్రభావాలతో మానసిక రుగ్మతల భారం పెరుగుతూనే ఉంది. పురుషుల కంటే ఎక్కువ మంది మహిళలు దీని బారిన పడుతున్నారు. నిరాశ, నిస్పృహ, బాధ, ఆనందం కోల్పోవడం, ఆత్మ విశ్వాసం కోల్పోవడం, నిద్ర లేమి, ఆకలి, అలసట, ఏకాగ్రత లేక పోవడం వంటివి ఈ మానసిక రుగ్మత కు కారణములు.
వీటి ప్రభావములతో మనుషులు ఆత్మహత్యలను చేసుకుంటారు . మానసిక రుగ్మతలు: నిరాశ (డిప్రెషన్), బైపోలార్ డిజార్డర్, మనోవైకల్యం( స్కిజోఫ్రెనియా) , సైకోసెస్, చిత్తవైకల్యం, ఆటిజం. నిరాశ, నిస్పృహ, మానసిక రుగ్మతల ఆరోగ్య పరముగా, సామాజికంగా బయట పడటానికి ప్రజలకు అవకాశం ఉన్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2013 లో వారి మానసిక ఆరోగ్య కార్యాచరణ ప్రణాళిక 2013-2020 ప్రజలందరికీ ఆరోగ్యాన్ని సాధించడంలో పూర్తిగా విఫలమైంది.
మానసిక ఆరోగ్యానికి మరింత సమర్థవంతమైన నాయకత్వం పాలన,సమాజ-ఆధారిత అమరికలలో సమగ్ర, అందరికి మానసిక ఆరోగ్యం, సామాజిక సంరక్షణ సేవలను అందించడం, అమలు , నివారణ కోసం వ్యూహాల అమలు,సమాచార వ్యవస్థలు, పరిశోధనలను బలోపేతం చేయలేక విఫలమయ్యింది. 2008 లో ప్రారంభించిన డబ్ల్యూహెచ్ఓ యొక్క మెంటల్ హెల్త్ గ్యాప్ యాక్షన్ ప్రోగ్రామ్, ప్రపంచ దేశాలలో సేవలను విస్తరించడానికి, మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించే కార్యక్రమం.
మానసిక రుగ్మత, మానసిక వైకల్యం, మానసిక అనారోగ్యం అనగా మనస్సుకు సంబంధించిన ఒక అనారోగ్యం. మానసిక రుగ్మతతో ఉన్న ప్రజలు వింతగా ప్రవర్తిస్తారు, లేదా ఇతరుల దృష్టిలో వీరు వింత ఆలోచనలను కలిగి ఉన్న వారుగా వుంటారు. మానసిక అనారోగ్యం వ్యక్తి జీవితకాలంలో పెరుగుతుండవచ్చు లేదా తగ్గుతుండవచ్చు. ఇది జన్యువులతో, అనుభవంతో ముడిపడి ఉండవచ్చు. మొత్తం మీద మానసిక రుగ్మత మారుతూ ఉంటుందని భావించాలి. మానసిక ఆందోళన లక్షణం మన ముందున్న పరిస్థితి మనకు కష్టంగా ఉండడం.
ఈ కష్టం నుంచి బయటపడే మార్గం కనిపించకపోవడం. అది ఆర్థికపరమైన కష్టం కావొచ్చు. వృత్తిపరమైన కష్టం కావొచ్చు. రిలేషన్‌షిప్స్‌కు సంబంధించిన కష్టం కావొచ్చు. శారీరక సమస్యలు కూడా అయి ఉండొచ్చు. మనిషి ఆలోచన, జ్ఞాపక శక్తులలో మార్పులు రావటం, ఉద్వేగాలు, భావాలలో తేడా రావటమే మానసిక వ్యాధి. ఈ వ్యాధికి గురైన రోగుల దినచర్యల్లో తీవ్ర మార్పులు సంభవిస్తాయి. దీని మూలంగా రోగి తన చుట్టు పక్కల వారందరికీ అసౌకర్యంగా తయారవుతాడు.
మానసికవ్యాధి కారణాలు ముఖ్యంగా మెదడులో రసాయన మార్పులు కలగటం, అనువంశీకతకు గురవటం, బాధాకరమైన బాల్య అనుభవాలు, కుటుంబ వాతావరణం, లైంగిక పరమైన కారణాలు, పేదరికం, నిరుద్యోగం, అసమానతలు వంటి కారణాలు మానసిక వ్యాధులకు దారి తీస్తుంటాయి.
తీవ్రమైన మానసిక రుగ్మతలను సైకోసిస్ అంటారు. ఉదాహరణకు స్కిజోఫ్రేనియా, డిప్రెషన్, మానియా. తీవ్రతరం కానటువంటి మానిసిక వ్యాధులనే న్యూరోసిస్ అంటారు. ఉదాహరణకు ఆంక్జయిటీ న్యూరోసిస్, డిప్రెషన్ న్యూరోసిస్, హిస్టీరియా, అబ్ససివ్, కంపల్సివ్ న్యూరోసిస్, ఫోబియా.
సరిపడినంత నిద్ర, వ్యాయామం, యోగా, మంచి ఆరోగ్య అలవాట్లు, కుటుంబం, స్నేహితులతో మంచి బంధాలు కలిగి ఉండడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఒత్తిడి, కుంగుబాటు, భయం లేదా మరేదైనా మానసిక సమస్య ఎదురైనప్పుడు అందుబాటులో ఉన్న మానసిక ఆరోగ్య నిపుణులను కలిస్తే సమస్య తీవ్రం కాకుండా కాపాడుకోవచ్చు. మానసిక సమస్యకు సకాలంలో పరిష్కారం పొందాలి.