Home » దుష్ట పాలనకు చరమగీతం పలకండి

దుష్ట పాలనకు చరమగీతం పలకండి

-మంగళగిరిలో చేనేతల కుల బాంధవుల ఆత్మీయ సమావేశంలో నారా బ్రాహ్మణి
-ఎన్నికల ప్రచారంలో బ్రాహ్మణికి బ్రహ్మరథం పట్టిన మంగళగిరి వాసులు
-దారిపొడవునా పూలు చల్లుతూ, హారతులు పడుతూ ఘన స్వాగతం

మంగళగిరి: ఓటు హక్కు ద్వారా ఐదేళ్ల అరాచక పాలనకు చరమగీతం పలకాలని ఆంధ్రరాష్ట్ర ప్రజలకు నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మంగళగిరి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్, గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కు సంఘీభావంగా చేనేత కుల బాంధవుల ఆత్మీయ సమావేశము జరిగింది.

గుంటి నాగరాజు, ఆకురాతి నాగేంద్రం, మునగాల శ్రీనివాసరావు, జొన్నాదుల బాలకృష్ణ, గాజుల శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి నారా బ్రాహ్మణి ,గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి శ్రీ రత్న, టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ…మంగళగిరి ప్రజలు తమ కుటుంబసభ్యులని, లోకేష్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలి. అధికారంలోకి రాగానే మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామం.

చేనేత హబ్ గా మంగళగిరి:
మంగళగిరి చేనేతకు అంతర్జాతీయ గుర్తింపు కోసం నారా లోకేష్ గారు ఎంతో తపిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీగారిని మంగళగిరి చేనేత శాలువాతో లోకేష్ గారు సత్కరించారు. అధికారంలోకి రాగానే చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేస్తాం. పవర్ లూమ్ కు 500 యూనిట్లు, హ్యాండ్ లూమ్ కు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అమలు చేస్తాం. నేతన్నలకు ఇన్సూరెన్స్ కల్పిస్తాం. ముడి సరుకులు, నూలు, రంగులపై సబ్సిడీ పునరుద్దరిస్తాం. పండుగ కానుకల్లో చేనేత వస్త్రాలను కూడా చేర్చి అందిస్తాం.ప్రతి నియోజకవర్గంలో చేనేత బజార్లు ఏర్పాటు చేస్తాం.

పెమ్మసాని శ్రీరత్న మాట్లాడుతూ..
ఇంతటి అరాచకపు ప్రభుత్వం జీవితంలో వద్దు. మీరు వేసే ఓటు మీ భవిష్యత్ ను నిర్ణయిస్తుందని గుర్తుంచుకోండి. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేసే వాడే నిజమైన నాయకుడు. ఆ లక్షణాలు ఉన్న వ్యక్తి నారా లోకేష్. లోకేష్ గారి ఆధ్వర్యంలో మంగళగిరి చేనేతకు అంతర్జాతీయ ఖ్యతి రావడం ఖాయం.

పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలి. మంగళగిరి వాసులంతా నారా లోకేష్ గారిని గెలిపించడమే కాదు…80 వేలకు పైగా మెజారిటీ ఇవ్వాలి. ధరల బాదులు, పన్నులు, చార్జీల మోతతో మధ్య తరగతి , పేదలను రోడ్డున పడేసిన జగన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పాలి. అన్ని వర్గాలను ఆదుకునేలా మేనిఫెస్టో రూపొందించిన చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అందిస్తారు. ఈ ఆత్మీయ సమావేశంలో నందం అబద్దయ్య,చిల్లపల్లి శ్రీనివాసరావు, తమ్మిశెట్టి జానకీదేవి, దామర్ల రాజు, మునగపాటి మారుతిరావు, కోసూరి రాజా, గుత్తికొండ ధనుంజయరావు, కాండ్రు శ్రీనివాసరావు, పెండెం శివరామకృష్ణ, ఊట్ల శ్రీమన్నారాయణ, కారంపూడి అంకమ్మరావు, మండ్రు రాము, జగ్గారపు రాము, వింజమూరు ఆషాబాల, మున్నంగి శివ శేషయ్య, బట్టు చిదానంద శాస్త్రి పాల్గొన్నారు.

మంగళగిరి నియోజకవర్గంలో నారా బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం:
దుగ్గిరాల మండలం ఈమని పంచాయతీ నల్లమేకలవారిపాలెంలో కొలువైన గోపయ్య స్వామి సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం, రామాలయం, శ్రీకృష్ణుడు, నాగేంద్ర స్వామి ఆలయాల్లో నారా బ్రాహ్మణి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చర్చిలో ప్రార్థనలు చేశారు. ఓల్డ్ మంగళగిరిలోని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. అనంతరం మంగళగిరి బాప్టిస్టు కాలనీలోని చర్చిలో ప్రార్థనలు చేశారు

Leave a Reply