• కమీషన్ల కక్కుర్తితో లడ్డూప్రసాదం తయారీలో నాణ్యతకు తిలోదకాలు.
• లడ్డూప్రసాదం తయారీలోని నాణ్యతా లోపాలను విజిలెన్స్ విభాగం పరీక్షిస్తుందా..లేదా?
• అపవిత్ర చర్యలతో తిరుమల ప్రాశస్త్యాన్ని, పవిత్రతను మంటగలుపుతున్న టీటీడీ
• టీటీడీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చి, భక్తుల మనోభావాలు మంటగలిపారు.
• ఆగమశాస్త్రానికి విరుద్ధంగా తిరుమలలో జరిగే కార్యక్రమాలపై మఠాధిపతులు, స్వామీజీలు స్పందించరా?
• తిరుమలక్షేత్రంలో జరిగే ఘటనలపై ప్రభుత్వం తక్షణమే ఒక కమిటీ వేసి, బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలి.
– టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చి రామ్ ప్రసాద్
తిరుపతి శ్రీవారి ప్రసాదాన్ని శ్రీవారి భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారని, ఆ ప్రసాదంలోనే స్వామివారిని చూసుకొని భక్తులు తరిస్తారని, అలాంటి లడ్డూ ప్రసాదాన్ని ఈ ప్రభుత్వం వ్యాపారవస్తువుగా మార్చిందని, దాని తయారీలో నాసిర కం పదార్థాలు వాడుతున్నారని, టీటీడీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా వ్యవహరిస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరామ్ ప్రసాద్ తెలిపారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే…
పవిత్రమైన లడ్డూప్రసాదాన్ని కమీషన్ల కక్కుర్తి తో నాణ్యతారహితంగా మార్చారు.
“ తిరుమల శ్రీవారి లడ్డూప్రసాదం తయారీలో గతంలో నాణ్యమైన గోధుమపిండి, దేశవాళీ ఆవునెయ్యి, యాలుకలు, పచ్చకర్పూరం, జీడిపప్పు, బాదంపప్పు వాడేవా రు. ఎంతోమెత్తగా నోటిలో వేసుకోగానే కరిగిపోయేలా, కమ్మని రుచితో ఉండేది. అలాంటి లడ్డూ నేడు క్రికెట్ బాల్ లా గట్టిగా తయారైంది. ఇప్పుడు ఇస్తున్న లడ్డూ రెండు రోజులకే వాసనవచ్చి, బూజుపడుతోంది. కమీషన్ల కక్కుర్తితో లడ్డూ తయారీలో నాసిరకం పదార్థాలు వాడుతున్నారు.
గతంలో ఏ1 క్వాలిటీ జీడిపప్పు వాడేవా రు..ఇప్పుడున్న ప్రసాదంలో జీడిపప్పు బదులు ముక్కలే కనిపిస్తున్నాయి. స్వామి వారి సేవలు, కైంకర్యాలకు వినియోగించే పాలన్నీ తిరుమలలోని గోశాల నుంచే రావాలి. ఇప్పుడు బయటిపాలు స్వామివారి సేవలకు నివేదిస్తున్నారని చెబుతున్నారు.
ప్రసాదాలు, గదుల అద్దెల ధరలు పెంచారు…పవిత్రమైన ప్రసాదాన్ని ఎన్నికల వేళ తిను బండారంలా పంచిపెట్టారు
టీడీపీప్రభుత్వంలో స్వామి వారి లడ్డూప్రసాదం ధర రూ.25లు అయితే, ఈ ప్రభుత్వం దాన్ని రూ.50కి పెంచింది. రూ.25ల వడప్రసాదం ధరను రూ.100కు పెంచారు. కల్యాణ లడ్డూధర రూ.100 నుంచి రూ.200లకు పెంచారు. గతప్రభుత్వంలో స్వామి వారిని దర్శించుకున్నభక్తులకు ఉచితంగా చిన్నలడ్డూలు అందించేవారు. ఇవాళ అలా పంచడంలేదు. గదుల అద్దెధరలు పెంచారు. పవిత్రమైన ప్రసాదాన్ని గతంలోఎన్నికల సందర్భంలో ఇష్టమొచ్చినట్టు తినుబండారాల్లా పంచిపెట్టారు.
ప్రతి విషయంలో ఈ ప్రభుత్వం తిరుమల ప్రాశస్త్యాన్ని, పవిత్రతను మంటగలిపేలా వ్యవహరించడం బాధాకరం. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం హిందూధర్మంపై, మతంపై గౌరవమున్నా.. స్వామి వారిపై భయభక్తులున్నా ప్రసాదం తయారీలో నాణ్యమైన పదార్థాలే వాడాలని డిమాం డ్ చేస్తున్నాం.
స్వామివారి సన్నిధిలో జరిగే అన్నప్రసాద వితరణకు ఉచితంగా కూర గాయలు, ఇతర నిత్యావసరాలు అందించే వారిపై కూడా ప్రభుత్వం కావాలనే కక్షసాధిం పులకు పాల్పడుతోంది. బాధ్యతాయుతంగా, ధర్మంగా పనిచేయాల్సిన టీటీడీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చి, స్వామివారి పవిత్రత, భక్తుల మనోభావాలు, మంటగలిపింది.
లడ్డూప్రసాదం తయారీ సహా, టీటీడీలో జరిగే అనేక తప్పిదాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి.
గతంలో లడ్డూతయారీకి అవునెయ్యి సరఫరా చేసే కంపెనీల్ని కాదని, టీటీడీ బోర్డు లోఉన్న ఉత్తరప్రదేశ్ కు చెందిన కొందరు వ్యక్తులు ఇతరకంపెనీలకు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ అప్పగించారు. అలానే ఒకగ్రూప్ గా ఏర్పడి, జీడిపప్పు, బాదంపప్పు, యా లుకల సరఫరా టెండర్లు కొట్టేసేపనిలో ఉన్నారు. ఈ ప్రొక్యూర్ మెంట్ ముసుగులో కావాల్సిన వారికే టీటీడీ టెండర్లు కట్టబెడుతోంది.
దశాబ్దాలుగా స్వామివారి ప్రసాదం తయారీకి అవసరమైన వస్తువులు అందిస్తున్న వారు, నేడు ఈప్రభుత్వానికి నచ్చక పోవడం వెనకున్న రహస్యం అందరూ తెలుసుకోవాలి.
లడ్డూప్రసాదం తయారీకి విని యోగించే పదార్థాలను విజిలెన్స్ తనిఖీచేసిందా..చేస్తే ఎలాంటి లోపాలు గుర్తించింది? ఏ అంశాలను ఆధారం చేసుకొని టీటీడీ దశాబ్దాలనుంచి స్వామివారి సేవలో నిమగ్న మైన సంస్థల్ని పక్కనపెట్టింది? జేట్యాక్స్ కలెక్షన్స్ కోసమే ప్రతిష్టాత్మకసంస్థల్ని కాదని పనిగట్టుకొని మరీ నచ్చినవారికి కాంట్రాక్టులు కట్టబెడుతున్నారు. మఠాధిపతులు.. స్వామీజీలు కూడా తిరుమల లడ్డూ తయారీ వ్యవహారంలో జరుగుతున్న లోగుట్టు వ్యవహారాలపై దృష్టిపెట్టాలని కోరుతున్నాం.
గతంలో టీటీడీ విభాగం ఎలా పనిచేసేదో, గత ప్రభుత్వాలు తిరుమల క్షేత్రాన్ని, అక్కడి క్రతువుల్ని, ఇతరత్రా వ్యవహారాల్ని ఎంత పవిత్రంగా నిర్వహించేవో ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అప్పటికి.. ఇప్పటికీ టీటీ డీ పనితీరు, ప్రవర్తన ఎలా మారిందో గ్రహించాలని కోరుతున్నాం. టీటీడీలో జరిగే తప్పిదాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి. తక్షణమే ఒకకమిటీ వేసి, ప్రసాదం తయారీ సహా, ఇతర కార్యక్రమాలపై నివేదిక తెప్పించుకొని చర్యలు తీసుకోవాలి.” అని రామ్ ప్రసాద్ డిమాండ్ చేశారు.