Suryaa.co.in

Telangana

బీసీల్లో ధైర్యాన్ని నింపిన గొప్ప నేత రాహుల్

– జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కులగణన మొదలవ్వడానికి అసలైన కారణం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ… ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీల కారణంగా నేడు కులగణన రాష్ట్రంలో మొదలైందని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం శేర్లింగంపల్లి మండలంలోని పలు ప్రాంతాల్లో సామాజిక ఆర్థిక ఉపాధి రాజకీయ కుల సర్వే జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ‌ బీసీలు బాగుపడాలంటే కులగణనతోనే సాధ్యమంటూ బలంగా నమ్మిన వ్యక్తి, శక్తి రాహుల్ గాంధీనే.. ఆయనే లేకపోయి ఉంటే ఈరోజు ఈ అడుగు పడి ఉండేదా అనే అనుమానాలు కలగకమానవు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎంతగానో ఆలోచించి ముందుకు సాగుతూ ఉన్నారు. ఎవరెన్ని అడ్డుకట్టలు వేసినా కూడా ఆయన తన నిర్ణయం మారదంటూ తేల్చి చెప్పారు. ఆయనతో రంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ సాయి యాదవ్ వి వెంకటరమణ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE