Home » రాయలసీమ ద్రోహి జగన్

రాయలసీమ ద్రోహి జగన్

-చిత్తూరును విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతా
-భూ హక్కు చట్టం వస్తే ప్రజల భూములే కాదు వైసీపీ కార్యకర్తల భూములకు రక్షణ ఉండదు
-భూ చట్టం వస్తే ప్రజల మెడకు ఉరి – ఓటుతో మీరెయ్యాలి ఫ్యాన్ కి ఉరి
-వైసీపీకి ఓటేస్తే ప్రజలు జగన్ కి పాలేరులవుతారు
-కుప్పంలో కేజీ బంగారం ఇచ్చినా జగన్ కి ఓటు వేయరు
-పొలాల్లో పిశాచిలా సర్వే రాళ్లపై జగన్ బొమ్మ
-ఆడబిడ్డలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్
-89 ప్రజాగళం సభలు సూపర్ సక్సెస్
-చిత్తూరు ప్రజాగళం సభలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు

చిత్తూరు: రాష్ట్రంలో గాలి వీస్తుంది. తుఫాను మారుతుంది. అడ్డం వస్తే బంగాళాఖాతంలో తొక్కేస్తాం. జనసేన, టిడిపి లు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. ఎన్నికల ప్రచారంలో చివర దశను నేను పుట్టిన జిల్లాలోనే పెట్టాలని నిశ్చయించుకున్నాను. నాకు రాజకీయ జన్మనిచ్చిన జిల్లా. నన్ను అభిమానించిన ప్రజానీకం మీరు. మీ గౌరవాన్ని కాపాడటానికి అనునిత్యం పని చేశాను. చిత్తూరు జిల్లాకు మామూలు వ్యక్తి, ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రిగా కూడా వచ్చాను. చిత్తూరు జిల్లా ప్రజలు ఎంతో అభిమానించారు. పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు కట్టించేందుకు కృషి చేశాను.

హైవే రోడ్ల బీజం పడటానికి కారణం టీడీపీనే
చిత్తూరు జిల్లాలో పరిశ్రమలు రావాలని తిరుపతిని ఎలక్ట్రానిక్ హబ్ గా పెట్టి టీసీఎల్, హీరో, జోహాన్, కార్బన్, డిక్సన్ వంటి కంపెనీని తీసుకువచ్చాను. అభివృద్ధికి మారు పేరు టీడీపీ, అవినీతికి మారు పేరు వైసీపీ. అన్ని జాతీయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశాం. రోడ్లు అభివృద్ధి చేశాం. దేశంలోనే మంచి రోడ్లు ఉండాలని మలేషియాలో రోడ్లను పరిశీలించి వాజ్ పేయి తో చెప్పి నెల్లూరు – చెన్నై హైవేలకు బీజం వేశాం. ఇప్పుడు అన్ని చోట్ల హైవేలు వచ్చేస్తున్నాయి. టెలీకమ్యూనికేషన్ సెక్టార్ లో డీ రెగ్యులేషన్ తెచ్చాను. అందుకే ఈ రోజు సెల్ ఫోన్లు అందరికి అందుబాటులో వచ్చాయి. నాడు ఆరోజు సెల్ ఫోన్ అంటే కూడు పెడుతుందా అని అవహేళన చేశారు. ఇప్పుడు అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి.

సినిమా సెట్టింగ్లను మించిపోయేలా కుప్పం గేట్లు
సాగు నీటి ప్రాజెక్టులు చేపట్టిన వ్యక్తి ఎన్టీఆర్. కృష్ణా జలాలు రాయలసీమకు రావాలని, తెలుగు గంగ, ఎస్ఆర్బీసీ, గాలేరు నగరి ప్రాజెక్టులు చేపట్టారు. రూ.65వేల కోట్లతో అన్ని ప్రాజెక్టులను చేపట్టాను. నేను మళ్లీ అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే అడవిపల్లి రిజర్వాయర్ నుంచి చిత్తూరు కు నీళ్లు అంది ఉండేవి. ఐదేళ్లుగా ఒక్క ప్రాజెక్టు కట్టాడా? తట్ట మట్టి ఎత్తాడా? సినిమా సెట్టింగ్ ల సీఎం వచ్చి కుప్పం గేట్లు పెట్టి, లారీ ట్యాంకెర్లతో నీళ్లు వదిలారు. జగన్ విమానం ఎక్కడంతో నీళ్లు అయిపోయాయి. ఇదే మోసం అంటే. చిత్తూరు జిల్లాలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది.

జగన్ పై ప్రజల్లో తీవ్రమైన తిరుగుబాటు
పాపాల పెద్దిరెడ్డి అవినీతి విచ్చలవిడి పెరిగిపోయింది. పదవులు, హోదాలు, కాంట్రాక్టర్లు అన్ని ఆయనకు, ఆయన కుటుంబం సభ్యులకే కావాలా? తిన్నదంతా మక్కెలిరగదన్ని కక్కిస్తాను. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి ఒక ఎర్రచందనం స్మగ్లర్. జగన్ ఎర్రచందనం స్మగ్లర్ కు సీట్లు ఇచ్చి జిల్లాను తాకట్టు పెట్టాలనుకుంటున్నారు. స్మగ్లర్లకు ప్రజలు భయపడాలా? జగన్ పై ప్రజల్లో తీవ్రమైన తిరుగుబాటు ఉంది. రాష్ట్రమంతటా తిరగబడింది. ఎప్పుడూ 40 ఏళ్లల్లో చూడని గాలి వచ్చింది.

ఐదేళ్లల్లో బాగుపడింది ఆ ఐదుగురే
ఐదేళ్లల్లో రాష్ట్రం ఎంత నష్టపోయింది? ప్రజలు ఎంత నష్టపోయారో చూడాలి. ప్రజల్లో ఆవేదన, కసి, బాధ ఉంది. అనుభవించిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆవేశం ఉంది. 89వ సభలోను ఇదే స్పందన, ఇదే ఉత్సాహం. యువత వీరోచితంగా రోడ్ల మీదకు వచ్చారు. మహిళలు సైతం భయటకు వస్తున్నారు. చిరు వ్యాపారస్థులు అవస్థలు పడ్డారు. పాపాల పెద్దిరెడ్డి ఏ2 విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రెడ్డి, జగన్మోహన్ రెడ్డి లు తప్పా మరెవ్వరూ బాగుపడలేదు. రెడ్లు కూడా బాగపడలేదు. ఏ రెడ్డికైనా ఆదాయం పెరిగిందా? మామిడి తోటలు ఉన్న రైతులు ఎవరైనా బాగుపడ్డారా?

రాయలసీమలో బలిజలకు ఎందుకు సీటు ఇవ్వలేదు జగన్?
పవన్ సినిమాలోను హీరోనే కాదు నిజజీవితంలోను హీరో. ప్రజలను ఆదుకోవాలని ముందుకు రావడమే కాదు ఎలాంటి త్యాగాలు చేయడానికైనా సిద్ధపడ్డారు. టిడిపి, జనసేన, బీజేపీలు కలిసింది ప్రజల నిలబడాలి, రాష్ట్రం గెలవాలి, పిల్లల భవిష్యత్ బాగుండాలి. నేను జైల్లో ఉన్నప్పుడు పొత్తు పెట్టుకుంటామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. జగన్ రాయలసీమలో ఒక్క సీటు బలిజలకు ఇచ్చారా? కమ్మలకు ఎందుకు సీటు ఇవ్వలేదు? పలమనేరు అమర్ నాథ్ రెడ్డి, పుంగనూరు చెల్లా బాబు, తంబళ్ల పల్లి జయచంద్రారెడ్డి, పీలేరు కిషోర్ కుమార్ రెడ్డి, కాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డికి ఇచ్చాం. బీసీలకు రాయలసీమలో జగన్ ఎందుకు ఇవ్వలేదు. కాని టీడీపీ బోయలు, కురబలకు ఇచ్చాం. బీజేపీ తరుపున కిరణ్ కుమార్ రెడ్డి రాజం పేట నుంచి పోటీచేస్తున్నారు అది సామాజిక వ్యాయం.

నేరాలు చెయ్యను చేసిన వ్యక్తికి శిక్షపడే వరకు ఊరుకోను
నిత్యావసర ధరలు, పెట్రోల్ డీజిల్, పన్నులు, ఇంటి పన్ను, చెత్తపన్ను, ఆస్తిపన్ను పెరిగిపోయాయి. పేద వాళ్లకు పూటగడవడమే కష్టం అయ్యింది. జగన్ రూ.10 బటన్ నొక్కి రూ. 100 కొట్టేస్తున్నారు. సహజ సంపదతో రూ.1000 దోచేస్తున్నారు. జగన్ ఒక అహంకారి, ఒక విధ్వంసకారుడు, ఒక సైకో. నార్త్ కొరియాలో కిమ్ ఉంటే జగన్ జిమ్. ఎవ్వరైనా నవ్వితే కొడతారు. మీ ఇంట్లో కష్టం వచ్చి ఏడిస్తే కొడతారు. వీళ్ల ముందు కూర్చోలేం.

వీళ్లకు తల్లి, తండ్రి, బాబాయ్, చెల్లి కూడా లెక్కలేదు. ఎవరైనా ప్రశ్నిస్తే ఇంటికి గొడ్డలి వస్తుంది. బాబాయ్ పై గొడ్డలి వేటు వేసింది ఎవరు? వాళ్లు తప్పు చేసి నారాసుర అంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఈ జిల్లా వాసిగా ఏనాడైనా హత్యా రాజకీయాలు, నేరాలు చేయడం నాకు చేతకాదు. కాని నేరాలు చేసిన వ్యక్తిని తుంగలో తొక్కేస్తాను. నేను తప్పు చేయను చేసిన వ్యక్తిని వదిలిపెట్టను. కోడి కత్తి డ్రామా అయ్యాక, గులకరాయి డ్రామాలాడారు.

ఎవరైనా ప్రశ్నిస్తే సాక్షితో వ్యక్తిత్వ హననం చేస్తున్న జగన్
టిడిపి వస్తే పథకాలు ఆగిపోతాయని అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డు లా చెప్పిందే చెబుతున్నారు. నేను వస్తే రెండింతల సంక్షేమం పెంచి ఇస్తాను. 2014-19 అభివృద్ధి, సంక్షేమం చేశాను. కాని జగన్ ఐదేళ్లు బటన్ నొక్కాడు. అందుకు సీఎం కావాలా? పసి పిల్లవాడు సైతం బటన్ నొక్కగలడు. ఉద్యోగాలు సాధించడానికి, పేదవాళ్లను ఆదుకోవడానికి, సంపాదన పెంచడానికి, రోడ్లు వేయడానికి ముఖ్యమంత్రి కావాలి. నేను రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాను.

కానీ జగన్ వచ్చిన వెంటనే అమర్ రాజా కంపెనీ పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయింది. అంటే భారతీ కంపెనీనే ఉండాలి. మరే కంపెనీ ఇక్కడ ఉండకూడదా? అంటే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే భారతీ కంపెనీ మూయించలేనా? ఎవరైనా ప్రశ్నిస్తే సాక్షి పేపర్ ద్వారా క్యారక్టర్ అసాసినేట్ చేస్తారు. అబద్దాలు చెప్పి చెప్పి మీ మైండ్ కరాబు చేసే వ్యక్తి జగన్. మేటల్ క్వారీని పాపాల పెద్దిరెడ్డి కబ్జా చేశారు. కేజీఎఫ్ మాదిరి ఎక్కడికక్కడ తొవ్వేసి ఇష్టానుసారంగా లూటీ చేశారు. కుప్పంలో కేజీ బంగారం ఇచ్చినా జగన్ కు ఓటు వేయరు.

జగన్ కి ఓటేస్తే మీ భూమికి భద్రత లేనట్టే
గతంలో పట్టాదారు పుస్తకంపై రాజముద్ర ఉండేది. కాని నేడు దాని స్థానంలో సైకో ఫోటో వేసుకున్నారు. వీళ్లకు ఈ భూమి జగన్ తాత ఇచ్చాడా? చివరి సారి, చించేసి చెత్తబెట్టలో పారేస్తున్నా. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే రాజముద్రతో పట్టాదారు పుస్తకం ఇస్తాను. రేపటి నుంచి పట్టాదారు పాసు పుస్తకం, రికార్డులు ఉండవు, 10 (1)లు ఉండవు. మీకు జిరాక్స్ కాపీ ఇస్తారు. దానితో బ్యాంక్ లోన్ ఇస్తుందా? అమ్మడానికి వీలు అవుతుందా?

మీ భూమి మీద జగన్ కన్నేశాడు. మీ రికార్డులన్ని అమెరికాలో కంప్యూటర్ లో పెట్టుకున్నారు. అక్కడ జగన్ దళారి పని చేస్తున్నాడు. మీరు భూమి అమ్మాలనుకుంటే ఆ దళారి పర్మిషన్ కావాలి. అది కూడా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ను అధికారులకు బదులు జగన్ గుమస్తాను నియమించుకుంటారు. భూమి అమ్మదలుచుకుంటే ఆ మనిషి అడ్డుపడతాడు. మీ భూమి మీరు అమ్మడానికి వీలు లేదు. రికార్డు మారుస్తే మీ జాతకాలు తారుమారవుతాయి. సివిల్ కోర్టు లు కూడా లేవు. హైకోర్టుకు పోవాలి. అక్కడికి పోతే 10 ఏళ్లకు కూడా న్యాయం జరగదు. మీ భూమి మీది కాదు. మీరు జగన్ కు ఓటేస్తే ఆయన దగ్గర మీరు పాలేరులు అవుతారు. మీకు భూమి లేకపోతే మీకు భద్రత పోతుంది.

ఓటుతో ఫ్యాన్ కి ఉరి వేయాలి
భూమి అనేది అందరికి ఆధారం. సెంటు భూమి మధ్య ఎన్నో వివాదాలు వచ్చేవి. కాని జగన్ ఏకంగా మీ మొత్తం భూమి కొట్టేసేందుకు కుట్ర పన్నుతున్నారు. అందుకే ఈ నల్లచట్టాన్ని చిత్తు చిత్తుగా చించేసి చెత్తబుట్టలో పడేస్తాను. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబియింగ్ యాక్ట్ రద్దు చేస్తాను. వైసీపీ నాయకుల భూమి కూడా వాళ్లది కాదు. అది కూడా జగన్ రెడ్డిదే. అందరం భూ హక్కు కాపాడుకోవాలంటే మీ మెడకు ఉరి వేశాడు. మీరు ఫ్యాన్ కి ఉరి వేయాలి. వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో పడేయాలి.

జన్మభూమిని కాపాడుకునేందుకు విదేశాల నుంచి తరలివస్తున్న ప్రవాసాంధ్రులు
అక్రమంగా జైల్లో పెట్టినందుకు 80దేశాల్లో ప్రపంచ మొత్తం 53 రోజులు నా కోసం పోరాడారు. రుణం తీర్చుకునేందుకు ముందుకు రావడం సంతోషకరం. కొంత మంది నా మీద, పవన్ మీద అభిమానంతో, లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడికి వస్తున్నారు. జన్మభూమిని కాపాడుకోవాలి, జన్మనిచ్చిన భూమిని కాపాడుకోవాలి. మళ్లీ సైకో వస్తే రాష్ట్రానికి పుట్టగతలు ఉండవనుకుంటున్నారు. నాడు నేను తెచ్చిన ఐటీ పాలసీతో ఒక రైతు బిడ్డ ప్రపంచ మొత్తం వెళుతున్నారు. గ్లోబల్ సిటిజన్స్ గా మారిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడి వెళ్లినా తెలుగు వాళ్లు ఉంటారు. తెలుగు వారందరిని గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దుతాను.
సైకోని ఇంటికి పంపే వజ్రాయుధం ఓటు.

చిత్తూరును విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతాను
చంద్రన్న బీమా ద్వారా సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదవ శాత్తు చనిపోతే రూ.10 లక్షలు ఇస్తాం. ఆరోగ్య బీమా రూ.20 లక్షలు ఇస్తాం. బీసీ డిక్లరేషన్ ను తెస్తాను. తెలుగుదేశానికి వెన్నుముక బీసీలు. 40 ఏళ్లుగా ఆదరించారు. రూ.1.50 లక్షల కోట్లతో బడ్జెట్ పెడతాను. కార్పరేషన్లు, ఆదరణ, స్వయం ఉపాధి పెంచుతాను. రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా పైకి తీసుకువస్తాను. ఎమ్మార్పీఎస్ కు న్యాయం చేస్తాను. జనాభా దామాషా ప్రకారం న్యాయం చేస్తాను. చిత్తూరుని విద్యా కేంద్రంగా చేసే బాధ్యత నాది.

మైనారిటీలకు అండగా నిలబడతా
మైనారిటీలను అన్ని విధాలుగా ఆదుకున్నాం. రెండు ఉర్దూ యూనివర్సిటీలు పెట్టాం, ఉర్దూ భాషను రెండో భాషగా చేశాం. హజ్ హౌస్ లు కట్టాం. దుల్హన్, విదేశీ విద్య, ఇమామ్ మౌజన్ లకు గౌరవ వేతనం ఇచ్చాం. ఢిల్లీలో సీఏఏ, ఎన్ఆర్ సీకి మద్దతు ఇచ్చి గల్లీలో గలీజ్ రాజకీయం చేస్తున్నారు. 4 శాతం రిజర్వేషన్ కాపాడతాం. అందరికి న్యాయం చేసే బాధ్యత నాది.

Leave a Reply