Home » జగన్మోహన్ రెడ్డి ఒక జీవచ్ఛవం

జగన్మోహన్ రెడ్డి ఒక జీవచ్ఛవం

-అందరికీ కుటుంబ సభ్యులు ఉన్నారు… నీ వెనుక ఎవరున్నారు జగన్?
-సొంత చెల్లెళ్లు, పినతండ్రి భార్య… అందరూ నిన్ను ఓడించమనిచెప్పే వాళ్లే
-గత ఎన్నికల్లో నీ వెంటే ఉన్న తల్లి, చెల్లి ఇప్పుడు ఎక్కడ జగన్??
-చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన భూ రక్ష చీకటి చట్టం జీవో ప్రతులను ప్రతి ఒక్కరూ తగలబెట్టి, ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పంచుకోవాల
– నర్సాపురం పార్లమెంట్ సభ్యులు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘు రామ కృష్ణంరాజు

మనిషిగా చచ్చిపోయి జగన్మోహన్ రెడ్డి జీవచ్ఛవంగా మిగిలారని, ఓడిపోయిన తర్వాత అయినా మనిషిగా బ్రతకడానికి ప్రయత్నించాలని నరసాపురం పార్లమెంట్ సభ్యులు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు సూచించారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తక్కువ సమయం ఉండడంతో తన తరఫున భార్య , కుమారుడు, కుమార్తె ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రతి ఓటర్ ను కలుసుకొని, ఓట్లను అభ్యర్థించారని గుర్తు చేశారు.

జగన్మోహన్ రెడ్డి తరఫున ప్రజలను ఓట్లు అడగడానికి ఎవరున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఏమి పోగొట్టుకున్నారో తెలుసుకోవాలన్నారు. డబ్బులు ఇచ్చి ఎన్ని ఓట్లు కొనుక్కుంటావని ప్రశ్నించిన ఆయన , మనిషిగా ఓడిపోయావని, నీ తరఫున ఓట్లు అడగడానికి నీ వారంటూ ఎవరూ లేరన్నారు. నిన్ను ఓడించమని నీ సొంత చెల్లెలు, నీ పిన తండ్రి భార్యనే ప్రజలను కోరుతున్నారు. ఐ పిటీ యూ జగన్ మనిషిగా నువ్వు చచ్చిపోయావు… ఇప్పటికైనా మారగలిగితే మారు అని రఘురామకృష్ణం రాజు సలహా ఇచ్చారు .

శనివారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జైల్లో ఉన్నప్పుడు నన్ను పాదయాత్ర చేయమని జగన్మోహన్ రెడ్డి అడగలేదా అంటూ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు, ఆయన సొంత చెల్లెలు షర్మిలా రెడ్డి ప్రశ్నించారని గుర్తు చేశారు. అలాగే 2019 ఎన్నికల్లోను పార్టీ తరఫున ప్రచారం నిర్వహించాలని కోరి, ఇప్పుడు రాజకీయాలలోకి రావద్దని అనడం ఎంతవరకు సమంజసమని నిలదీసిందని పేర్కొన్నారు.

గతంలో జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేసినప్పుడు తల్లి, చెల్లి రోడెక్కి కన్నీరు కార్చారన్నారు. ఇప్పుడు వారు ఎక్కడ అని, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పడం కంటే ముందు నీ సొంత చెల్లెలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు నీ విధ్వంసం అర్థమైంది. ప్రజలు నారా చంద్రబాబు నాయుడుని నాయకుడిగా ఎన్నుకోబోతున్నారు. ఓడిపోయిన తర్వాత అయినా మనిషిగా బ్రతకడానికి ప్రయత్నించు. నీ తండ్రి స్నేహితుడిగా, ఒకప్పుడు నిన్ను ప్రేమించిన దౌర్భాగ్యుడిగా చెబుతున్నానని రఘురామకృష్ణం రాజు అన్నారు.

కలెక్టర్, తహసిల్దార్ ఆఫీస్ తనఖా పెట్టినట్లుగానే మన ఆస్తులను తాకట్టు పెడతాడు
విశాఖపట్నంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని, తహసిల్దార్ ఆఫీసును తాకట్టు పెట్టినట్లుగానే భూ రక్షా చట్టం ద్వారా ఒరిజినల్ పత్రాలను తన వద్ద పెట్టుకుని మన ఆస్తులను కూడా అప్పు కోసం జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెడతారని రఘురామకృష్ణం రాజు అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత, కూటమి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన ఈ రాజ పత్రాన్ని ప్రజలంతా దహనం చేయాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి జారీ చేసిన జీవో ప్రతుల తో పాటు, మన ఆస్తి పత్రం జిరాక్స్ కాపీని జత చేసి తగలబెట్టాలన్న ఆయన, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భూ రక్ష పథకం కింద ఇచ్చే జిరాక్స్ కాపీ మనం దగ్ధం చేసిన ప్రతులతో సమానమని తెలియజేయాలని కోరారు.

భూ రక్షా చట్టం పథకం ఎంతో గొప్పదని చెప్పడానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ వంటి వారు కూడా పిచ్చి పిచ్చి మాటలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒరిజినల్ ఆస్తి పత్రాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టుకొని, జిరాక్స్ పత్రాలను మనకు ఇస్తామంటే ప్రజలు ఎవరు ఈ చట్టం గొప్పదని విశ్వసించడానికి సిద్ధంగా లేరన్నారు. ఏదైనా భూమి డిస్ప్యూట్లో ఉంటే ఆ భూ సమస్య పరిష్కరించుకోవడానికి కింది కోర్టులను ఆశ్రయించడానికి వీలులేదని, కేవలం హైకోర్టును మాత్రమే ఆశ్రయించాలని జీవోలో పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

45 పేజీల ఈ జీవోలో ప్రతి పేరా జగన్ మోహన్ రెడ్డి కుట్ర పూరిత మనస్తత్వానికి అద్దం పడుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే నీ ఇల్లు ఎవరికో తాకట్టు పెడతారని, మన ఆస్తులకు గ్యారెంటీ లేదని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రాక్షసి చట్టం నుంచి ప్రజలను బయటపడేయాల్సిన బాధ్యత మన అందరి పై ఉన్నదన్నారు.

నాలుగు గంటల తర్వాత ఈ రాక్షసి చట్టం జీవో ప్రతులను నేను కూడా దహనం చేసి ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఐదు గంటల లోపే ప్రతి ఒక్కరూ తాము దహనం చేసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని కోరారు. ఐదు గంటల తర్వాత ఎన్నికల నిబంధనల ప్రకారం ఎవరు కూడా రాజకీయపరమైన అంశాలను పోస్ట్ చేయడానికి వీలు లేదని గుర్తు చేశారు.

ఒరిజినల్ ఆస్తి పత్రాలు కావాలంటే కూటమికి ఓటు వేయాలి
ఒరిజినల్ ఆస్తి పత్రాలు కావాలంటే ప్రజలంతా నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని, డూప్లికేట్ ఆస్తి పత్రాలు కావాలనుకునేవారు డూప్లికేట్ నాయకుడైన జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయవచ్చునని రఘురామ కృష్ణంరాజు అన్నారు. కూటమికి ఓటు వేసి అత్యధిక స్థానాలలో గెలిపించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా 175 స్థానాలకు 175 స్థానాలని నేను చెప్పను. కుక్కలు చింపిన విస్తరిలా చేసిన రాష్ట్రాన్ని మళ్లీ పునర్ నిర్మించుకోవడానికి కూటమిని అత్యధిక స్థానాలలో గెలిపించాలన్నారు. గతంలో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి చేసిన తప్పుకు ఇప్పుడు ఎంతోమంది పశ్చాత్తాప పడుతున్నారన్నారు .

ఎన్నికల రోజు ఎప్పుడు వస్తుందని వారు ఎదురుచూస్తున్నారు. పోలింగ్ రోజు క్యూ లైన్ లో నిలబడి ఈసారి జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించాలని నిర్ణయించుకున్నారన్నారు . తప్పు చేసిన వారు గంగా నదిలో స్నానం ఆచరిస్తే పాపం పోయినట్టుగా, గత ఎన్నికల్లో చేసిన తప్పుకు ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి ప్రజలు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భావిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 144 అసెంబ్లీ స్థానాలలో సైకిల్ గుర్తు పోటీ చేస్తుందని, 21 స్థానాలలో గాజు గ్లాసు, పది స్థానాలలో కమలం గుర్తు ఉంటుందని, పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని రఘురామ కృష్ణంరాజు కోరారు.

రాక్షస చట్టాన్ని తీసుకువచ్చిన జగన్మోహన్ రెడ్డి
జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే రాక్షస చట్టం ప్రతులను దహనం చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత, కూటమి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం మీ ఆస్తికి మీరు యజమానులు కాదు. ఒరిజినల్ టైటిల్ డీడ్స్ యజమానుల వద్ద ఉండడం సహజం. కానీ ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులకు సంబంధించిన ఒరిజినల్ టైటిల్ డిడ్స్ ప్రభుత్వం వద్ద ఉంటాయన్నారు.

ఉదాహరణకు ఒక బ్యాంకు వద్దకు వెళ్లి రుణాన్ని కోరితే ఆస్తి తాలూకా ఒరిజినల్ టైటిల్ డీడ్ సమర్పిస్తే రుణాన్ని ఇస్తారన్నారు. అదే బ్యాంకర్ వద్ద టైటిల్ డీడ్ జిరాక్స్ కాపీని ఇస్తామంటే రుణాన్ని ఇస్తారా అని ప్రశ్నించారు. ఏపీ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం ప్రజల ఆస్తికి సంబంధించిన ఒరిజినల్ టైటిల్ డాక్యుమెంట్స్ జగన్మోహన్ రెడ్డి వద్ద పెట్టుకుని, మనకు జిరాక్స్ కాపీ ఇస్తాడట… ప్రజల్ని ఏమైనా పిచ్చివారని అనుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి అంటూ నిలదీశారు. ప్రజల ఆస్తుల ఒరిజినల్ పత్రాలు తన వద్ద పెట్టుకొని, ఎందుకు పనికిరాని జిరాక్స్ కాపీని ఇస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖపట్నంలోని ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డి, అదే విశాఖపట్నంను రాష్ట్ర రాజధానిగా చేస్తానని చెబుతారని ఎద్దేవా చేశారు. విశాఖలో అద్భుతమైన రాజధాని నిర్మిస్తానని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి, తాను నివసించడానికి మాత్రం 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పెట్టి రుషికొండకు గుండు కొట్టి రాజ ప్రసాదం వంటి భవనం నిర్మించుకున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు . విశాఖపట్నంలోని కలెక్టరేట్ కార్యాలయం, తహసిల్దార్ ఆఫీస్, ఉద్యానవనాలను ఎందుకు తాకట్టు పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు.

ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి రెండు నిమిషాల షార్ట్ ఫిలిం ఒకటి వచ్చిందని, అందులో ఒక కుటుంబం ఇంటికి తాళాలు వేసి తిరుపతికి వెళ్లి వచ్చేలోపే వైకాపా కండువా కప్పుకున్న ఒక వ్యక్తి ఇంట్లో నుంచిబయటకు వస్తారన్నారు. ఎవరు మీరు అని ఇంటి యజమాని ప్రశ్నించగా… జగన్మోహన్ రెడ్డి ఈ ఇల్లు మాకు ఇచ్చారని సమాధానం చెబుతాడు. ఈ ఇల్లు నాదని కావాలంటే పొరుగింటి వారిని అడిగి పిస్తానని చెప్పి, పక్కింట్లోకి వెళ్ళగా ఆ ఇంట్లో నుంచి కూడా వైకాపా కండువాలు కప్పుకున్న వ్యక్తులే బయటకు వస్తారన్నారు. ఇలా ఏపీ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని రఘురామకృష్ణం రాజు ఆందోళన వ్యక్తం చేశారు.

చంద్రబాబు అధికారంలోకి రాగానే ఏపీ టైటిలింగ్ యాక్ట్ రద్దు
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకు వచ్చిన రాక్షస చట్టమైన ఏపీ టైటిలింగ్ యాక్ట్ ను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుమేరకు అన్ని గ్రామాలలో ఈ చెత్త పిచ్చి జీవో ప్రతులకు, మన ఆస్తి పత్రం జిరాక్స్ కాపీని జత చేస్తూ దగ్ధం చేయాలని కోరారు.

ఏపీ టైటిలింగ్ యాక్ట్ కు వైకాపా నాయకులు కొత్త కలర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చెబితేనే, ఏపీ టైటిలింగ్ యాక్ట్ అమలు చేస్తున్నామని చెబుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చెబితే బిజెపి పాలిత 18 రాష్ట్రాలు ఎందుకు అమలు చేయడం లేదని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఏమైనా ప్రజల ఒరిజినల్ ఆస్తి పత్రాలను తన వద్ద పెట్టుకొని, జిరాక్స్ కాపీలను ఇవ్వమని చెప్పిందా అంటూ నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏమిటి?, జగన్మోహన్ రెడ్డి చేసిందేమిటని రఘురామ కృష్ణంరాజు సూటిగా ప్రశ్నించారు.

ఉండి నియోజకవర్గంలో గ్రామ గ్రామాన ఏపీ టైటిలింగ్ యాక్ట్ ప్రతులు దగ్ధం
ఉండి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 74 గ్రామాలలో ఏపీ టైటిలింగ్ యాక్ట్ ప్రతులను దగ్ధం చేయనున్నట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారని, శాశ్వతంగా ఈ రాక్షస చట్టాన్ని రద్దు చేస్తారని తెలిపారు. మన తాతలు తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూములను, ఆస్తులను మనం మన పిల్లలకు ఇవ్వాలనుకుంటున్న వాటిపై ప్రజలకే పూర్తి హక్కు కల్పించే విధంగా జీవో తీసుకువస్తారన్నారు.

చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా అత్యధిక స్థానాలలో కూటమిని గెలిపించాలి
చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా కూటమిని అత్యధిక స్థానాలలో గెలిపించి, నాయకులకు రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యతలను అప్పగించాలని ప్రజలను రఘురామకృష్ణం రాజు కోరారు. 75 ఏళ్ల లేత వయసులోనూ చంద్రబాబు నాయుడు ఎండనకా వాననకా ఎవరికోసం కష్టపడుతున్నారని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసిన రాష్ట్రాన్ని, పునర్ నిర్మించడానికి శ్రమిస్తున్నారని తెలిపారు. సమకాలీన రాజకీయాలలో చంద్రబాబు నాయుడు మాదిరిగా కష్టించి పని చేసే నాయకుడు లేరని అన్నారు.

అటువంటి నాయకుడు రాష్ట్రానికి చాలా అవసరమని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడుని ఉన్నతంగా గౌరవించాలంటే చరిత్రలో గతంలో ఎవరు గెలవనన్ని స్థానాలలో గెలిపించి, ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యతలను అప్పగించాలని సూచించారు. రాష్ట్రాన్ని పునర్ నిర్మించడానికి ప్రజలంతా ఆయనకు సహాయకులుగా ఉండాలన్న రఘురామ కృష్ణంరాజు, అమరావతి మహానగరాన్ని, పోలవరం ప్రాజెక్టులను ఏకకాలంలో యుద్ధ ప్రాతిపదికన చేపడుతూనే రాష్ట్రానికి పరిశ్రమలను ఆహ్వానించాల్సిన అవసరం ఉందన్నారు. ఒకటి తరువాత మరొకటి చేస్తామంటే ఇప్పుడు కుదరదని, అన్ని ఏకకాలంలోనే చేయాల్సిన అవసరం ఉందన్నారు.

అది ఏ ఒక్కరి వల్ల సాధ్యమయ్యే పని కాదని, చంద్రబాబు నాయుడు వంటి దూర దృష్టి కలిగిన నాయకుడికి మనమంతా సహకారం అందిస్తేనే సాధ్యమవుతుందని చెప్పారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం గతంలో చంద్రబాబు నాయుడు చేసిన కృషిపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన సైన్యాధిపతులుగా పనిచేయాలని కోరారు. చంద్రబాబు నాయుడు దూరదృష్టి పై నాకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. చంద్రబాబు నాయుడు కంటే 14 ఏళ్ల చిన్నవాడినైన నేను ఆయన కష్టాన్ని చూసిన తర్వాత బాధ్యతగా కష్టపడాలనే విధానాన్ని నేర్చుకున్నానని తెలిపారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉండి కి రావడానికి చంద్రబాబు నాయుడుకు 25 నిమిషాలు ఆలస్యం అయినప్పటికీ, 40 నిమిషాల పాటు సమయాన్ని కేటాయించారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల సమస్యలను నేను ఆయన దృష్టికి తీసుకు వెళ్ళినప్పుడు ఓపికగా విన్నారు. అన్నీ విన్న తర్వాత రఘురామ కృష్ణంరాజు చెప్పిన ప్రతి సమస్యను పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఉండి నుంచి ఏలూరు, గన్నవరం సభలకు తీవ్రమైన ఎండలోనే వెళ్లారు.

వాతావరణ పరిస్థితుల మార్పుల కారణంగా విపరీతమైన వానలోనూ గొడుగు పట్టుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడి నుంచి ఇంకో జిల్లాకు చంద్రబాబు నాయుడు బయలుదేరి వెళ్లారని, ఆయన పట్టుదల చూస్తే వయసు అనేది కేవలం ఒక అంకె మాత్రమేనని స్పష్టమవుతుందన్నారు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదనడానికి నిలువెత్తు నిదర్శనం, ప్రత్యక్ష నిదర్శనం చంద్రబాబు నాయుడే నని పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ త్యాగం అసామాన్యం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్యాగం అసమాన్యమైనదని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఈ రాక్షసుడ్ని తుద ముట్టించాలంటే కూటమి ఏర్పాటు తద్యమని భావించి, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని, బిజెపిని కూటమిలోకి తీసుకురావడానికి ఆయన చేసిన కృషి ప్రశంసనీయమైనదని అన్నారు. గత రెండేళ్లుగా నేను కూడా తెలుగుదేశం, జనసేన, బిజెపి కలిసి పోటీ చేయాలని, దానికి తగ్గట్టుగానే ప్రయత్నాన్ని చేశానన్నారు. జగన్మోహన్ రెడ్డి పంచన ఉన్న కొంతమంది పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఆయన్నికొందరి వాడిగా చూపెట్టే ప్రయత్నాన్ని చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ను అన్ని సామాజిక వర్గాలకు చెందినవారు అక్కున చేర్చుకుంటున్నారని తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి వంటి రాక్షసుడుని అంతమొందించాలంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మాదిరిగా ఈ మూడు పార్టీలు కలవాల్సిన అవసరం ఉందని రచ్చబండ కార్యక్రమంలో ఎప్పటినుంచో చెబుతూనే వస్తున్నానని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు . జైల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి నన్ను చంపాలనుకున్నాడు. చంద్రబాబు నాయుడు కృషి, వెంకటేశ్వర స్వామి దయతో బ్రతికి బయటపడ్డాను. రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు అచ్చం నాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర లను ఒక కారణంగా జైల్లో పెట్టి వేధించారు. వారు వీరు కాదని అన్యాయంగా నారా చంద్రబాబు నాయుడుని సైతం జైల్లో పెట్టారు.

ఒక టెర్రరిస్టు ఖైదీని ట్రీట్ చేసినట్లుగా ఆయన్ని ట్రీట్ చేశారని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చంద్రబాబు నాయుడు చెప్పారని గుర్తు చేశారు. టేబుల్, కుర్చీ, మంచం అనేదీ కూడా లేకుండా చేసి నేలపై పడుకోబెట్టరని పేర్కొన్నారన్నారు. వెస్ట్రన్ కమోడ్ ఉంటే తొలగించి ఇండియన్ కమోడ్ ఏర్పాటుచేసి వేధించాలనుకోవడం జగన్మోహన్ రెడ్డి పైశాచికత్వానికి పరాకాష్ట అని రఘురామకృష్ణం రాజు విమర్శించారు.14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవలు అందించిన ఒక మహా నాయకుడిని ట్రీట్ చేసే విధానం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలా వ్యవహరించిన వాడిని మనిషి అనాలా మృగమని అనాలా, జగన్మోహన్ రెడ్డి అని అనాలా అంటూ ప్రశ్నించారు. అటువంటి వ్యక్తిని సమిష్టిగా ఎదుర్కొని ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలించాలనే ఒకే ఒక సంకల్పంతో స్వలాభాన్ని, రాజకీయ ఆపేక్షను పక్కన పెట్టి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుని, కేంద్రం అవసరాన్ని గుర్తించి బిజెపిని కూటమిలోకి తీసుకువచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ దేనిని చెప్పారు. కూటమితో పొత్తు కుదుర్చుకోవడంలో బిజెపిపై కొన్ని అపోహలు ఉన్నప్పటికీ, వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ పవన్ కళ్యాణ్ విజయవంతంగా కూటమి ఏర్పాటుకు కృషి చేశారన్నారు. కూటమి ఏర్పాటులో అద్భుతమైన కేటలిస్టుగా పవన్ కళ్యాణ్ పనిచేశారని కొనియాడారు.

సిద్ధం సిద్ధం అంటూ… పారిపోవడానికి సిద్ధమైన జగన్మోహన్ రెడ్డి
సిద్ధం సిద్ధం అంటూ పారిపోవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారని ఆయన సోదరి షర్మిల పేర్కొన్నారని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. ఎన్నికల అనంతరం విదేశాలకు వెళ్లి జూన్ ఒకటవ తేదీన తిరిగి వస్తానని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి, మళ్లీ దేశానికి తిరిగి వచ్చే పరిస్థితి లేదన్నారు.

బ్యాలెట్ నెంబర్ ఒకటి లో సైకిల్ గుర్తు, నా ఫోటో ఉంటుంది
ఉండి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ప్రజలంతా 13వ తేదీన తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని రఘురామకృష్ణం రాజు కోరారు. అసెంబ్లీ బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ ఒకటి పై సైకిల్ గుర్తు, నా ఫోటో ఉంటుందని… నాకు ఓటు వేస్తే చంద్రబాబు నాయుడు కు ఓటు వేసినట్లుగానేనని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని, కూటమి నాయకత్వాన్ని బలపరచడానికి సైకిల్ గుర్తుతోపాటు, కూటమి అభ్యర్థులు ఎక్కడ ఎవరు పోటీ చేస్తుంటే వారి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Leave a Reply