Home » సచివాలయాల సేవల్లో రికార్డు

సచివాలయాల సేవల్లో రికార్డు

ఎంపి విజయసాయిరెడ్డి

ఎపిలో గ్రామ,వార్డు సచివాలయాల నుంచి తొలిసారి ఈ నెల 25 నాడు ఏకంగా 2.88 లక్షల వినతులు పరిష్కరించడం ద్వారా ఈ వ్యవస్థ సరికొత్త రికార్డు సృష్టించిదని రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. ఆదివారం సోషల్ మీడియా వేదికగా ఆయన పలు అంశాలపై స్పందించారు.

గ్రామ,వార్డు సచివాయాల ఏర్పాటు అయిన తరువాత మూడేళ్లలో సొంత ఊళ్లలోనే ప్రజలు మొత్తం 6.43 కోట్ల సేవలను పొందారని చెప్పారు. వీటిలో రెవెన్యూ సంబందిత సేవలను ప్రజలు అత్యధికంగా పొందారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతి పేద ఇంటి తలుపు తడుతుందని చెప్పారు. నేరుగా 1.82 లక్షల కోట్లు రుపాయలు ప్రజల ఖాతాల్లోకి బదిలి అయ్యిందని అన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పోలీసు శాఖపై ప్రజల విశ్వాసం, సమర్థత, నిజాయితీకి సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం,ప్రైవేట్ ఏజెన్సీలు నిర్వహించిన సర్వేలో ఏపీ పోలీసులు మొదటి స్థానంలో నిలవడంపై ఆ శాఖను ఆయన అభినందించారు.

భారతదేశంలో పులుల సంఖ్య పెరుగుతుండటం, ప్రపంచంలోని 70% పులులు భారతదేశంలోనే ఉండటం విశేషమే కానీ 133 రకాల జంతువులు, సరీసృపాలు మరియు పక్షులు ఒకే కొమ్ము గల ఖడ్గమృగం, ఆసియాటిక్ సింహం, ఘారియల్, గంగా డాల్ఫిన్, అడవి గుడ్లగూబ వంటివి ప్రమాదంలో ఉన్నాయాని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జీవులను కాపాడేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు..

Leave a Reply