– రేవంత్ పై ఏమైనా ప్లాన్ చేస్తున్నారనే అనుమానం
– టీపీసీసీ అధికార ప్రతినిధి అయోధ్య రెడ్డి , సుధీర్ రెడ్డి
బీజేపీ , టీఆర్ఎస్ రెండు కలసి రైతులని మోసం చేస్తున్నాయి.నీళ్లు , నిధులు , నియామకాల కోసం తెలంగాణ సాదించుకునం.రైతులు పండించిన పంటని కొనలేని దుస్థితిలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి.రైతులు పండించిన చివరి గింజ కోనేవరకు పోరాటం చేస్తామని రాహుల్ గాంధీ అన్నారు.ప్రజల పక్షాన పోరాటం చేస్తాం అన్న రాహుల్ గాంధీ ని టిఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తారా ? కేసీఆర్ కేంద్రానికి రాసిన లేఖ విషయంలో తెలంగాణ ప్రజలకి ఏం సమాధానం చెబుతారు. కెసిఆర్ గడిలో రెండు కుక్కలు ఉన్నాయి ..ఆ కుక్కలు రేవంత్ పై మాట్లాడుతున్నాయి. రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ దిక్సూచి.నిరుద్యోగుల గురంచి కెసిఆర్ ని ప్రశ్నించు బాల్క సుమన్ .రేవంత్ పేరు చెపితే కెసిఆర్ కి వణుకు పుట్టి హాస్పిటల్ కి వెళుతున్నాడు.
కేసీఆర్ కుటుంబానికి బాల్క సుమన్ బానిస
– టీపీసీసీ అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి
ప్రభుత్వంలో ఉన్న కొందరి మాటలు చూస్తే రేవంత్ పై ఏమైనా ప్లాన్ చేస్తున్నారనే అనుమానం కలుగుతుంది. బాల్క సుమన్ బెదిరిస్తే మేము బెదిరేవాలం కాదు. మేము డ్రగ్స్ , కరెంట్ , సంక్షేమ పథకాల మీద సవాల్ విసిరాం. సమాధానం లేదు. కేసీఆర్ కుటుంబానికి బాల్క సుమన్ బానిస. మేము అభివృద్ధిపై మాట్లాడుతున్నాం ..బాల్క సుమన్ ని నియోజకవర్గం అభివృద్ధి పై మాట్లాడదామా? రంజిత్ రెడ్డి అవగాహన తెచ్చుకొని మాట్లాడాలి.కాంగ్రెస్ పార్టీ పుణ్యాన మీరు ఎమ్మెల్యేలు అయ్యారు.కాంగ్రెస్ కార్యక్రమాలతో కెసిఆర్ కి రెండు మూడు రోజులకి జ్వరం వస్తుంది. రేవంత్ ని విమర్శించే సత్తా మీకు లేదు.