– రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర
హైదరాబాద్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల్ని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్రజల 70 కలను సాకారం చేస్తూ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చేసి బంగారుమయంగా తీర్చిదిద్దిన కేసీఆర్ ని రేవంత్ దూషించడం ఏమాత్రం క్షమించరానిదన్నారు.
అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్, వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందడంతో ప్రజలు ఛీత్కరిస్తున్నారని తెలుసుకుని అర్థంపర్థం లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ “డైవర్షన్ పాలిటిక్స్”చేస్తున్నారని ఎంపీ రవిచంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు.రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అహంకారపూరితమైనవి,బాధ్యత గల ముఖ్యమంత్రి పదవిలో ఉండి సంస్కారహీనంగా వ్యవహరిస్తున్నాడని, వెంటనే ఆయన కేసీఆర్ ని క్షమాపణలు కోరాలన్నారు.