Home » రేవంత్‌…. విద్యుత్‌ వ్యవస్థను కుప్పకూల్చావు

రేవంత్‌…. విద్యుత్‌ వ్యవస్థను కుప్పకూల్చావు

-ప్రతిపక్షాలు, ఉద్యోగులపై ఆరోపణలా?
-చిల్లర మాటలు ఆపాలని హితవు
-రేవంత్‌ వ్యాఖ్యలపై హరీష్‌రావు ట్వీట్‌

తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులపై సీఎం రేవంత్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా మాజీ మంత్రి హరీష్‌రావు ఖండిరచారు. కరెంట్‌ కోతల విషయంలో వైఫల్యా లను అంగీకరించకుండా ప్రతిపక్షాలు, విద్యుత్‌ ఉద్యోగులపై అభాండాలు మోపడం సరి కాదని వ్యాఖ్యానించారు. ఆయన వైఖరి ఆడ లేక పాత గజ్జెలు అనే సామెతను గుర్తు చేస్తుంది. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం 24 గంటల నిరంతరంగా విద్యుత్‌కు ఉద్యోగుల సహకా రంతో పటిష్ఠమైన వ్యవస్థను నిర్మించింది. కేవలం 5 నెలల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ వ్యవస్థను కుప్పకూల్చింది. గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు సరిపోయే విద్యుత్‌ సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైంది. చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేం దుకు ప్రతిపక్షాలు, విద్యుత్‌ ఉద్యోగులపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. విద్యుత్‌ ఉద్యోగులపై నెపం తప్ప కరెంటు కోతలను ఎలా సరిదిద్దాలనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి లేకపోవడం దురదృష్టకరం. చిల్లర మల్లర చేష్టలు మాని కేసీఆర్‌ ఇచ్చినట్లుగా 24 గంట ల విద్యుత్‌ను అన్ని రంగాలకు సరఫరా చేస్తే మంచిది. పాలనపై దృష్టి పెడితే మంచిదని హితవుపలికారు.

Leave a Reply