Suryaa.co.in

National

రోహిణి కార్తె ఎండలతో తీవ్ర ఇబ్బందులు

రోహిణి కార్తె ఫలితంగా.. ఈ పక్షం రోజులు అధిక వేడి గాలులు, తీవ్రమైన ఎండ, అగ్ని ప్రమాదాలు, ఉక్క పోతతో ఇబ్బంది పడుతూ ఉంటారు. రోహిణి నక్షత్రం చంద్రునికి సంబంధించిన నక్షత్ర రాశిగా పరిగణించ బడుతుంది.

సూర్య భగవానుడు రోహిణి నక్షత్రంలో ప్రవేశించి నప్పుడు, చంద్రుని చల్లదనం తగ్గుతుంది. దీని కారణంగా కొన్ని ప్రదేశాలలో ఈ సమయంలో రాత్రి పగలు అనే తేడా లేకుండా తీవ్రమైన వేడి ఉంటుంది.

ప్రస్తుతం రోహిణి కార్తె జరుగుతుంది. సూర్య భగవానుడు రోహిణి నక్షత్రం లోకి ప్రవేశించి నప్పుడు వేడి రోజురోజుకీ పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోహిణి కార్తె లోని ఎండలకు రోళ్లు, రోకళ్లు పగులుతాయని పెద్దలు చెప్పిన విషయం మన మనలో మెదలాడుతూ ఉంటుంది.

వేసవిలో ఉండే ఎండల వేడినే తట్టుకోలేమంటే.. ఇక ఎండా కాలంలో చివరి కార్తె అయిన రోహిణిలో ఎండలు అంటే మండుతాయి. ఈ ఏడాది రోహిణి కార్తె రోహిణి కార్తే మే 25 న ప్రారంభమై జూన్ 8వ తేదీతో ముగుస్తుంది.

LEAVE A RESPONSE