– నాటోను దించితే ప్రపంచంసర్వనాశనం తప్పదు
– ప్రపంచ మానవాళికి కోలుకోలేని దెబ్బ
USSR యునైటెడ్ సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్ (1922-1991)ఒకప్పటి సామ్యవాద రాజ్యం.మార్క్స్ ఆలోచనలకు లెనిన్ విధానాలకు ఏర్పడిన దేశం.స్టాలిన్ ఉక్కుసంకల్పంతో యూరోప్ జైత్రయాత్ర ద్వారా దాదాపు 30 దేశాలు సామ్యవాద దేశాలుగా అవతరించాయి.అభివృద్థి ఆర్థిక పరిస్థితులు క్షీణించి 1991లో బోరిస్ ఎల్సిన్ గ్లాస్ నాస్త్ ,పెరిస్ట్రైయికియా పేరుతో సంస్కరణలు తేవడం వలన కమ్యునిస్టు రాజ్యాలు కూలిపోయాయి.
ద్విధృవ ప్రపంచానికి ఓ పక్క అమెరికా రెండో పక్క సోవియట్ నాయకత్వం వహించేవి.వాటి మధ్య ప్రచ్ఛన్న యుద్ద వాతావరణం ఉండేది.అవిభక్త సోవియట్ లో 15 రాష్ట్రాలు ఉండేవి.ఎప్పడైతే సోవియట్ రష్యా కుప్పకూలిందో దానిలోని చాలా రాష్ట్రాలు న్వతంత్ర్యరాజ్యాలుగా అవతరించాయి.దానిలో ఉక్రెయిన్ ఒకటి.సోవియట్ పతనంతో అమెరికా ఏకైక అగ్రరాజ్యంగా ఏకధృవ ప్రపంచంగా అవతరించింది.రష్యా సరిగ్గా గురువారం అర్దరాత్రి 12.52కి ఉక్రెయిన్ పై ముప్పేట దాడితో సైనిక చర్యకు దిగినట్లు అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ప్రకటించారు .
ఉక్రెయిన్ లో అనేక ఖనిజసంపదలు,ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి.గోధుమ పంటకు ప్రసిద్థి.అయితే స్వతంత్ర దేశంగా అవతరించిన దగ్గర నుండి అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటున్నది.జనాభా పరంగా రష్యాలో నాలుగో వంతు కలిగి ఉంది. ఎప్పటికైనా రష్యాతో ముప్పు ఉందని భావించి, అమెరికా యూరోప్ కూటమికి దగ్గరగా జరిగింది.2014లో క్రిమియాను రష్యా తనలో కలిపేసుకుంది.విడిపోయిన సోవియట్లన్నింటిని రష్యా తిరిగి తన సైనిక బలంతో లొంగదీసుకుంటుందని అమెరికా ప్రచారం మొదలెట్టింది.నల్ల సముద్రంలో రష్యా ఆధిపత్యాన్ని సవాలు చేసి నియంత్రించే దిశగా, అమెరికా దాని మిత్రపక్షాల వ్యూహంలో భాగంగా ఉక్రెయిన్ పావుగా మారింది.దూరంగా ఉన్న మిత్రుడ్ని చూచి పక్కనే ఉన్న బలమైన రష్యాను ఢీ కొట్టడానికి సిద్థపడింది.
రష్యాను ఢీ కొట్టడానికి ఉక్రెయిన్ NATO సభ్యత్వానికి దరఖాస్తు చేసింది.NATO (NORTH ATLANTIC TREATY ORGANISATION)సభ్యత్వం కొరకు ఉక్రెయిన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది.రష్యా ఉక్రెయిన్ కు నాటోలో సభ్యత్వం వ్యతిరేకించింది.అయినా అమెరికా సామ్రాజ్యవాద శక్తులు రష్యాకు కొన ఊపిరిని కూడా మిగల్చరాదనే బలమైన కోరికతో, దాన్ని అస్థిరత్వం పాలు చేయడానికి ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం ఇవ్వడానికి అమెరికా సామ్రాజ్యవాదులు సిద్ధపడ్డారు.
ఇదే జరిగితే బలహీనమైన ఉక్రెయిన్ బలం పుంజుకుంటుంది.నాటోలో చేరాక దాడి చేస్తే నాటో దేశాలకు రష్యా ఉమ్మడి శతృవు అవుతుంది.ప్రస్తుతం రష్యా బలగాలతో గాని బలంలో గాని ఉక్రెయిన్ 10% ప్రతిఘటన చేయగలదు.
నాటో సిద్థాంతం ప్రకారం ఏ దేశమైనా సభ్యదేశంపై దాడి చేస్తే ఆ దాడి మిత్రదేశాలమీద అనే భావనతో అవి ఆటోమేటిక్ గా యుద్థంలోకి వస్తాయి.నాటో అండతో ఉక్రెయిన్ రష్యాను గడ్డిపూసలా తీసి
పారేస్తుంది.నాటో దేశాలకు ద్వారాలు బార్లా తెరిసింది.దీనితో రష్యాకు చిర్రెత్తుకొచ్చింది.రష్యా సమగ్రతకు ఉక్రెయిన్ ముప్పు తెస్తున్నదని కావున రాజధాని “కీవ్ ” పై సైనిక చర్య చేసి వశపరచుకుంటామని,అమెరికా నాటో దేశాలు యుద్దంలో పాల్గొంటే తీవ్రచర్యలు తప్పవని రష్యా హెచ్చరించింది.
సరిహద్దుల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఉక్రెయిన్ లోని రెండు ఫ్రావెన్స్ లు డొనెక్స్,లుహాన్స్ స్క్ ల నుండి వేలాది ప్రజలు రష్యాకు శరణార్థులుగా వెళ్ళారు.ఆ రెండు ఫ్రావెన్స్ లు రష్యాలో కలవడానికి
సిద్థంగా ఉన్నాయి.కాని వారిపై ఉక్రయిన్ అమర్యాదగా ప్రవర్తిస్తుందని రష్యా ఆరోపిస్తూ సైనికచర్యకు పూనుకొంది.ఉక్రయిన్ కూడా స్వంతబలాలు,మిత్రుల బలగాలతో ధీటుగా బదులిస్తాం రష్యాకు లొంగేది లేదు. మాదేశ సార్వభౌమత్వాన్ని ప్రాణాలొడ్డి కాపాడుకుంటాం అంటూ ఆ దేశ అధ్యక్షుడు తగ్గిదిలే అంటున్నాడు.అమెరికా కుడా ఉక్రెయిన్ పై యుద్దానికి దిగితే ఉపేక్షించేదిలేదని హెచ్చరిస్తున్నది.
ఇరు దేశాల వధ్ఙ అణ్వాయుధాలు పుష్కలంగా ఉన్నాయి.నాటో యుద్ధ గోదాలోకి దిగితే అణుయుద్థం వలన ప్రపంచం సర్వనాశనం అవుతుంది.చైనా లాంటి బలమైన దేశం రష్యాను సమర్థిన్తున్నది.అమెరికా,బ్రిటన్ వాటి మిత్రపక్షాలు ఉక్రెయిన్ కు మద్థతుగా ఉన్నాయి.భారత్ లాంటి ప్రపంచంలో ఐదవ పెద్ద ప్రజాస్వామ్య దేశం తటస్థంగా ఉంది.ఉక్రెయిన్ నుండి మన వైద్యవిద్యార్థులను స్వదేశానికి రప్పిస్తున్నది. రష్యా,ఉక్రెయిన్ సంక్షోభం తగ్గించడానికి భారత్ క్రియాశీలక పాత్ర పోషించక పోవడం శోచనీయం.
రష్యా ఎటు తిరిగి “కీవ్” పై బాంబుల వర్షం కురుపిస్తున్నది.ఆ దేశ సైనికులను ఆయుధాలు వదిలేచి ఇళ్ళకు వెళ్ళిపోమంటుంది.ప్రాణాలు పణంగా పెట్టైనా ఉక్రెయిన్ ను కాపాడుకుంటామని వృద్థులు సైతం సమరోత్సాహం ప్రదర్శించుట ఏ విపత్కర పరిణామాలకు దారి తీస్తుందో అని ప్రపంచం ఆందోళన చెందుతుంది.పరస్పర చర్చలు,సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కారం చేసుకోకుండా అణ్వాయుధాల మోహరింపుతో ప్రపంచశాంతిని భంగపరచే హక్కు రష్యాకు,ఉక్రెయిన్ వారి తోక అమెరికా సామ్రాజ్యవాదులకు లేదు.ఇప్పటికే నాటో కూటమి దేశాలు రష్యాపై పలు ఆంక్షలు విధించాయి.
అయినా తగ్గేది లే అంటూ ఉక్రెయిన్ విముక్తే థ్యేయం అని రష్యా అంటుంది.ఐక్యరాజ్యసమితి యుద్దనివారణకు ప్రయత్నిస్తున్నా చర్యలు ఆశాజనకంగా లేవు.నాటో దేశాలు ఆంక్షలతో ఆగిపోతే ప్రపంచానికి పెను ముప్పుతప్పినట్లే.అమెరికా ఆధిపత్యం కోసం నాటోను దించితే ప్రపంచంసర్వనాశనం తప్పదు.యుద్దం వారి మధ్యే అయినా ప్రపంచీకరణ,ప్రైవీటీకరణ నేపథ్యంలో ప్రపంచ మానవాళికి కోలుకోలేని దెబ్బ తథ్యం.
– రవీంద్ర తీగల