Suryaa.co.in

Andhra Pradesh

సవిత సూపర్!

అధికార మత్తు తలకెక్కితే తన..మన అనే భేదం ఉండదు. అహంకారంతో.. వెన్నంటి నిలిచి తన ఉన్నతికి జీవితాలను ధారబోసిన వారిని సైతం తృణప్రాయంగా త్యజిస్తారు కొందరు ప్రబుద్ధులు… ఇంకొందరు మాత్రం ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు.. అధికారాన్ని సేవగా భావిస్తారు. ఈ కోవలోకే వస్తారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత.

మంత్రిగా బాధ్యతలు చేపట్టినా… చుట్టూ మందీమార్బలం ఉన్నా… తనవారికి, తనను అందలం ఎక్కించిన నియోజక వర్గ వాసులకు మంత్రి సవిత ఎన్నడూ దూరం కాలేదు. సమయం దొరికిన ప్రతిసారీ అక్కా… అన్నా… అంటూ ఆప్యాయంగా వాళ్ల ఇళ్లకి వెళ్లి… వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ అందరితోనూ మా సవితమ్మ… మా రామచంద్రారెడ్డి బిడ్డ… అని దీవెనలు అందుకుంటున్నారు.

శుక్రవారం ఉదయం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం గ్రామానికి వస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు స్వాగతం పలుకడానికి మంత్రి సవిత వచ్చారు. కేంద్రమంత్రి రావడానికి ఇంకా సమయం ఉండడంతో, రోడ్డు పక్కనే ఉన్న చిన్న హోటల్ కు వెళ్లారు.

మంత్రిని అనే అహం చూపకుండా అందరితో కలిసి టిఫిన్ చేశారు. అన్నా… వ్యాపారం బాగుందా… కూటమి ప్రభుత్వమిస్తున్న ఉచిత గ్యాస్ అందుతుందా.. ? అంటూ హోటల్ యజమానిని ఆప్యాయంగా పలుకరించారు. అక్కడ టిఫిన్ చేస్తున్నవారితోనూ మాట్లాడారు. స్వయాన రాష్ట్ర మంత్రి తమ హోటల్ కు వచ్చి టిఫిన్ చేయడమే కాకుండా యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటుంటే, ఆ హోటల్ యజమాని, ఆయన సతీమణితో పాటు స్థానికులు సంభ్రామాశ్చర్యాలకు గురయ్యారు.

మంత్రి హోదాలో ఉన్న కూడా సవిత సింప్లిసిటీని చూసి.. మా సవితమ్మ సూపర్ అంటూ పొగడకుండా ఉండలేకపోయారు. ఎంత ఎదిగినా మా సవితమ్మ మారలేదంటూ ఉప్పొంగిపోయారు.

 

LEAVE A RESPONSE