Home » మద్యం టెండర్లలో చంద్రబాబు తప్పు చేశాడనడం సిగ్గుచేటు

మద్యం టెండర్లలో చంద్రబాబు తప్పు చేశాడనడం సిగ్గుచేటు

• కల్తీ మద్యంతో40 లక్షల మంది పేదల్నిఆసుపత్రుల పాలుచేసి.. 30వేల ప్రాణాలు బలితీసుకున్న జగన్ రెడ్డి
• నాలుగేళ్లలో కల్తీ మద్యం అమ్మకాలతో రూ.24వేలకోట్లు దిగమింగిన జగన్ రెడ్డి, నిస్సిగ్గుగా టీడీపీ ప్రభుత్వంపై,చంద్రబాబుపై నిందలేస్తూ, తన మద్యం దోపిడీని ప్రజలకు తెలియకుండా చేయాలనుకుంటున్నాడు
• రాష్ట్రంలో జరుగుతున్న మద్యం అమ్మకాలు.. తయారీ… సరఫరా.. డిస్టీలరీస్ పై సీబీఐ విచారణ కోరే ధైర్యం జగన్ కు ఉందా?
• ప్రివిలేజ్ ఫీజు తగ్గించారనే ఆరోపణ పచ్చి అబద్ధం.. ప్రివిలేజ్ ఫీజుకి సంబంధించి, చిన్నచిన్న మద్యం వ్యాపారుల్ని విజ్ఞప్తితో నాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రఖజానాకు రూ.1800 కోట్లఆదాయం వచ్చింది
• ఎన్నికల సమయంలో లేబుల్ రిజిస్ట్రేషన్ల కోసం కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చారనడం కూడా అవాస్తవమే.
• నాటి ప్రభుత్వం అప్పటికే మద్యం దుకాణాల లైసెన్స్ పొందిన వారు ఎవరైనా సరే, ప్రభుత్వానికి రూ.లక్ష పూచీకత్తు సమర్పించి లేబుల్ రిజిస్ట్రేషన్ పొందే వెసులు బాటు కల్పించింది
• అదే తప్పు అయితే మరి నేడు వైసీపీప్రభుత్వం దాదాపు 100కు పైగా మద్యం బ్రాండ్ల కు ఎలా అనుమతి ఇచ్చిందో జగన్ రెడ్డి. .వాసుదేవరెడ్డి సమాధానం చెప్పాలి
• కొన్ని డిస్టిలరీలకు మేలు చేశారని.. డిస్టిలరీల ఏర్పాటు విషయంలో స్వార్థ నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు పూర్తి అవాస్తవాలు
• డిస్టిలరీల ఏర్పాటు, వాటి అనుమతులకు సంబంధించి నాటి ప్రభుత్వం ఐ.ఏ.ఎస్ అధికారులు…రిటైర్డ్ చీఫ్ జస్టిస్ లు..చార్టెడ్ అకౌంటెంట్స్ కమిటీ సూచనల ప్రకారమే వ్యవహరించింది.
• జగన్ ప్రభుత్వం చెప్పిన పీ.ఎం.కే, విశాఖ డిస్టిలరీల విషయంలో గత ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరిస్తే, అవే డిస్టిలరీలు ఇప్పటికీ ప్రభుత్వ పెద్దల అధీనంలో ఎలా కొనసాగుతున్నాయి?
• స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ వస్తుందని తెలిసే జగన్.. తాను ఆడమన్నట్టు ఆడే వాసుదేవరెడ్డి ద్వారా చంద్రబాబుపై మద్యం కేసు పెట్టించాడు
– టీడీపీ శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు

జగన్మోహన్ రెడ్డి కుట్రతో, కక్షసాధింపుతో చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపాడని, ఆ కేసుని నిరూపించకలేక ఇటు ప్రజల్లో, అటు న్యాయస్థానంలో తీవ్రంగా అవమానపడ్డాడని, స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై బయటకు వస్తాడని ముందే పసిగట్టిన జగన్, టీడీపీ అధినేతపై మొన్నటికి మొన్న హాడావిడిగా మరో తప్పుడు కేసు నమోదు చేశాడని టీడీపీ నేత, శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడే జగన్ రెడ్డి అతని జేబు సంస్థ సీఐడీ, టీడీపీ అధినేతపై ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్లు ఘటనలకు సంబంధించిన కేసులు నమోదు చేశాయి. అవి చాలవన్నట్లు తాజాగా చంద్రబాబుపై మద్యం కేసు నమోదుచేశారు. కల్తీమద్యాన్ని రాష్ట్రంలో విచ్చలవి డిగా అమ్మిస్తూ, వైసీపీనేతలు.. మంత్రులతో మద్యం వ్యాపారం చేయిస్తూ.. ఆడబిడ్డల మానప్రాణాలను తన మద్యం మాఫియాకు బలిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి, సిగ్గులేకుం డా చంద్రబాబుపై మద్యం కేసు పెట్టించాడు.

జగన్ ఏరికోరి, తెలంగాణ బ్యాచ్ కు చెందిన ఐ.ఆర్.టీ.ఎస్ అధికారి వాసుదేవరెడ్డిని ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా.. డిస్టిలరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించిందే చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టడానికి
రాష్ట్రంలో జరుగుతున్న మద్యం మాఫియా వెనకున్న పాత్రధారి ఎవరైతే ఉన్నారో, అదే వ్యక్తితో తప్పుడు ఆరోపణలు చేయించి, ఈ ప్రభుత్వం చంద్రబాబుపై మద్యం కేసు పెట్టించింది. వాసుదేవరెడ్డి అనే అతను 2009 బ్యాచ్ కు చెందిన ఐ.ఆర్.టీ.ఎస్ (ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్) అధికారి. తెలంగాణకు చెందిన సదరు అధికారికి రాష్ట్రం గురించి, ఇక్కడి ప్రజలు.. వారి సమస్యల గురించి ఏమాత్రం తెలియదు. జగన్ అధికారంలోకి రాగానే, తన మద్యం దోపిడీకి పనికొస్తాడని ఏరికోరి వాసుదేవరెడ్డిని రాష్ట్రానికి తీసుకొచ్చాడు.

అతన్ని ఏరికోరి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా… డిస్టిలరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ గా జగన్మోహన్ రెడ్డి నియమించాడు. తన ధన దాహం తో రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మిస్తున్న జగన్మోహన్ రెడ్డి.. అతని దోపిడీకి సహకరిస్తూ, దాదాపు 40 లక్షల మంది పేదలు అనారోగ్యం పాలవ్వడానికి, వారి కుటుంబాలు రోడ్డున పడటానికి, 30వేల ప్రాణాలు మద్యం మహమ్మారికి బలైపోవడానికి కారణమై న వాసుదేవరెడ్డి కలిసి, మద్యం కంపెనీల అనుమతులకు సంబంధించి తప్పు జరిగిం దంటూ చంద్రబాబుపై ఆరోపణలు చేయడం.. తప్పుడు కేసులు పెట్టడం నిజంగా సిగ్గు చేటు.

జగన్ తన దోపిడీకోసం తీసుకొచ్చిన నూతన మద్యం విధానం వల్ల ప్రభుత్వఖ జానాకు ఎలాంటి ఆదాయం రాకపోయినా, తాడేపల్ల ప్యాలెస్ కు మాత్రం వేలకోట్లు చే రాయి. రాష్ట్రంలో జరిగే మద్యం అమ్మకాలద్వారా తాడేపల్లి ప్యాలెస్ కు వేలకోట్లు చేరడం వెనకున్న ప్రధాన వ్యక్తి అయిన వాసుదేవ రెడ్డి తీరుపై.. గతప్రభుత్వ నిర్ణయా లను అతను తప్పుపట్టడంపై అతని వైఖరి తెలిసిన వారంతా నవ్వుకుంటున్నారు.
ఏదోరకంగా గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంపై బురదజల్లాలి.. చంద్రబాబుని ప్రజల్లో పలుచన చేయాలనే వాసుదేవరెడ్డి స్టేట్ మెంట్ ఆధారంగా జగన్ రెడ్డి.. టీడీపీ అధినే తపై తప్పుడు కేసు పెట్టించాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యాన్ని రాష్ట్రంలో లేకుండా చేస్తానని, పేదల ప్రాణాలు కాపాడతానని ఎన్నికలకు ముందు చెప్పిన జగన్మోహన్ రెడ్డి, నేడు అదే మద్యంపై వచ్చే ఆదాయంతో ప్రభుత్వాన్ని నడిపే దుస్థితికి వచ్చాడు. అలాంటి వ్యక్తి మద్యం టెండర్లలో చంద్రబాబు తప్పుచేశాడని చెప్పడం…వాసుదేవరెడ్డి లాంటి తప్పుడు వ్యక్తి మాటలఆధారంగా చంద్రబాబుపై కేసు పెట్టడం నిజంగా హాస్యాస్పదం.

నాలుగేళ్లలో కల్తీ మద్యం అమ్మకాలతో రూ.24వేలకోట్లు దిగమింగిన జగన్ రెడ్డి.. మద్యం టెండర్లలో చంద్రబాబు తప్పు చేశాడనడం సిగ్గుచేటు
గత ప్రభుత్వం రాష్ట్రంలో అమలుచేసిన మద్యం పాలసీలో వినియోగదారుడికి తనకు నచ్చిన మద్యం కొనుక్కునే ఛాయిస్ ఉండేది. ఆ మద్యం కూడా తక్కువధరకు లభించేది. కానీ నేడు జగన్ రెడ్డి పాలనలో అంతా రివర్స్. అధికధర పెట్టినా నచ్చిన బ్రాండ్ దొరకదు. జగన్ తన కమీషన్లకోసం తనబినామీలతో అమ్మించే కల్తీమద్యం తప్ప రాష్ట్రంలో మరే బ్రాండ్ల మద్యం దొరకడంలేదు. ముఖ్యమంత్రి.. తనకు కమీషన్లు ఇచ్చే మద్యం కంపెనీలు తయారుచేసే నాసిరకం మద్యాన్ని మాత్రమే రాష్ట్రంలో విక్రయిస్తున్నాడు.

తన దోపిడీకోసం ఏపీ బీ.సీ.ఎల్ ను, డిస్టిలరీస్ కార్పొరేషన్ ను వాడుకోవ డం కోసం ఏకంగా ఆ రెండు విభాగాలను వాసుదేవరెడ్డికి కట్టబెట్టిన జగన్.. అతని ద్వారా ప్రభుత్వం అమ్మే మద్యం ద్వారా తనదోపిడీ కొనసాగిస్తున్నాడు. అమ్మేదే కల్తీ మద్యం.. అదికూడా ఎక్కువధరకు. ఆ కల్తీ మద్యం తయారుచేసేది.. సరఫరా చేసేది.. అమ్మేది అంతా జగన్..అతని మద్యం మాఫియానే.

ఈ విధంగా కేవలం మద్యం అమ్మ కాలతోనే జగన్ రెడ్డి నాలుగున్నరేళ్లలో రూ.24వేలకోట్ల వరకు దిగమింగాడు. వైసీపీ ప్రభుత్వ మద్యం మాఫియాపై ప్రధానప్రతిపక్షమైన టీడీపీ ప్రజలసాక్షిగా అనేక పోరాటాలు చేసింది. కేంద్రప్రభుత్వ సంస్థలకు ఫిర్యాదు కూడా చేసింది. అయినా జగన్ మద్యం మాఫియాపై చర్యలు లేవు.

టీడీపీప్రభుత్వంలో అమలైన మద్యం పాలసీ అటు ప్రభుత్వానికి…ఇటు వినియోగదా రులకు మేలు కలిగించిందే తప్ప..ఎక్కడా ఎలాంటి అవతవకలకు అవకాశమివ్వలేదు
టీడీపీప్రభుత్వంలో అమలైన మద్యం పాలసీ మొత్తం ఎంతో పారదర్శకంగా అమలైంది. టెండర్లు పిలవడం దగ్గరనుంచీ, దుకాణాలు అప్పగించే వరకు మొత్తం ప్రక్రియ అంతా మంత్రులకమిటీ..ఐ.ఏ.ఎస్ అధికారుల కమిటీ.. రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ లు.. రిటైర్డ్ చీఫ్ జస్టిస్ లు, చార్టెడ్ అకౌంటెంట్స్ ఇలా ఎందరో నిష్ణాతులైన వ్యక్తుల పర్యవేక్షణలో, వారి సిఫార్సులతో ప్రతి నిర్ణయం ఎంతో పారదర్శకంగా అమలైంది. ఎక్కడా ఎలాంటి చిన్న తప్పుకు కూడా అవకాశం లేకుండా నాడు టీడీపీప్రభుత్వం రాష్ట్రంలో మద్యం పాలసీని అమలుచేసింది. దానివల్ల ఏపీలో నాణ్యమైన మద్యమే, అందుబాటు ధరల్లో లభించింది.

జగన్ ప్రభుత్వం చేస్తున్న నిరాధార ఆరోపణలు.. వాస్తవాలు :
ఆరోపణ-1 : మద్యం టెండర్లకు సంబంధించిన ప్రివిలేజ్ ఫీజు తగ్గించారు అని.
వాస్తవం : టీడీపీప్రభుత్వంలో అధికారులుగా ఉన్న అజయ్ కల్లం రెడ్డి.. మరికొం దరు ఐ.ఏ.ఎస్ అధికారులు కలిసి నాడు మద్యం వ్యాపారం చేసే చిన్నచిన్న వ్యాపారు ల అభ్యర్థన మేరకు ఆనాడు ప్రివిలేజ్ ఫీజు తగ్గించడం జరిగింది. కానీ మద్యం దుకాణాల కు సంబంధించిన అప్లికేషన్ ఫీజును నాటి ప్రభుత్వం రూ.2లక్షలుగా నిర్ణయించడంతో తద్వారా రూ.1800కోట్ల ఆదాయం ఒక్క సంవత్సరంలోనే ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యింది. అలానే అడిషనల్ ఎక్సైజ్ ట్యాక్స్ 35శాతం విధించడం వల్ల, ప్రభుత్వానికి ఎక్కువగా అదనపు ఆదాయం వచ్చింది. ప్రభుత్వ ఆదాయం పెరగడానికే నాటి ప్రభు త్వం ఒకపద్ధతి ప్రకారం వ్యవహరించింది.

నాటి రాష్ట్రప్రభుత్వ నిర్ణయాన్ని సమీక్షించే అధికారం ఏపీ.బీ.సీ.ఎల్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి లాంటి కిందిస్థాయి అధికారికిలేదు. కింది స్థాయి వ్యక్తి ప్రభుత్వ పాలసీ లు.. నాటి విధానాలను తప్పుపట్టడం ముమ్మాటికీ ఈప్రభుత్వ రాజకీయకుట్రలో భాగమే. ఒకవేళ నిజంగా నాటి ప్రభుత్వ నిర్ణయం తప్పే అయితే, ఆ నిర్ణయాన్ని అమ లుచేసిన నాటి ప్రభుత్వంలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ కల్లం రెడ్డి కూడా దోషే అవుతారు. నేడు జగన్ ప్రభుత్వంలో కీలకస్థానంలో ఉన్న అజయ్ కల్లం రెడ్డిపై మాత్రం ఏపీ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోదు. కేవలం సెలక్టివ్ ప్రాసిక్యూషన్ లో భాగంగానే జగన్, అతని ప్రభుత్వం ఎంపిక చేసినవారిపైనే తప్పుడు కేసులు పెడుతూ… వారినే ఇరికించాలని చూస్తోంది.

ఆరోపణ-2 : ఎన్నికల సమయంలో లేబుల్ రిజిస్ట్రేషన్ కోసం నాటి ప్రభుత్వం కొన్ని కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చింది.
వాస్తవం : అది చాలా సింపుల్ ప్రాసెస్. అప్పటికే మద్యం దుకాణాల లైసెన్స్ పొందిన వారు ఎవరైనా సరే, ప్రభుత్వానికి రూ.లక్ష పూచీకత్తు సమర్పించి లేబుల్ రిజిస్ట్రేషన్ పొందవచ్చు. అదే తప్పు అయితే మరి నేడు వైసీపీప్రభుత్వం దాదాపు 100కు పైగా మద్యం బ్రాండ్ల కు ఎలా అనుమతి ఇచ్చింది?

ఆరోపణ-3 : డిస్టిలరీల ఏర్పాటుకు సంబంధించిన అనుమతుల్లో పీ.ఎం.కే.. విశాఖ డిస్టిలరీస్ విషయంలో తప్పు చేశారని
వాస్తవం : డిస్టిలరీలకు అనుమతులకు సంబంధించి నాటి ప్రభుత్వం ఒక కమిటీని నియమించి, ఆ కమిటీ సూచనల ప్రకారమే వ్యవహరించింది. ఆ కమిటీలో రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ లు, రిటైర్డ్ న్యాయమూర్తులు, చార్టెడ్ అకౌంటెంట్స్ సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రం విడిపోయాక.. తెలంగాణలో ఎక్కువ డిస్టిలరీలు ఉండి.. ఇక్కడ తక్కువ ఉండ టంతో ఇక్కడి అవసరాల మేరకు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వ్యవహరించి, అన్ని అర్హతులున్న సంస్థలకు అనుమతులు ఇవ్వ డం జరిగింది.

జగన్ ప్రభుత్వం చెప్పిన పీ.ఎం.కే డిస్టిలరీస్, విశాఖ డిస్టిలరీలు ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్దల అధీనంలోనే కొనసాగుతున్నాయి. ఆనాడు రాయలసీమ ప్రాంతంలో ఖాయిలా పడిన ఒక పెద్ద డిస్టి లరీ అభ్యర్థన మేరకు వారికి వాయిదాల పద్ధతిలో ప్రభుత్వానికి సొమ్ము చెల్లించే వెసు లుబాటు కల్పించడం జరిగింది. ఆనిర్ణయం కూడా కేబినెట్లో చర్చించే తీసుకోవడం జరిగింది. ఆ డిస్టిలరీలో పనిచేసే ఉద్యోగులు.. వెనుకబడిన ప్రాంతంలోని పరిస్థితి దృష్ట్యానే నాడు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ఎస్పీవై డిస్టిలరీస్ కోసం నిబంధనలు అతిక్రమించడంపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారు?
కానీ నేడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ముఖ్యమంత్రి బంధువుల కోసం ఎస్పీవై డిస్టిలరీస్ కోసం అడ్డగోలుగా నిబంధనలు అతిక్రమించింది. దాదాపు 14 లక్షల లీటర్ల మద్యం ప్యాకింగ్ జరుగుతోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మే కల్తీ మద్యంలో ఎక్కువభాగం ఎస్పీవై డిస్టిలరీస్ నుంచే వస్తోంది. దీనిపై జగన్మోహన్ రెడ్డి.. వాసుదేవ రెడ్డి ఏం సమాధానం చెబుతారు?

నాటి ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన అజయ్ కల్లం రెడ్డి సిఫార్సుల మేరకు తీసుకున్న నిర్ణయాలను నేడు జగన్ ప్రభుత్వంలో కిందిస్థాయి అధికారిగా ఉన్న వాసుదేవరెడ్డిఎలా తప్పుపడతారు? ఒక వేళ తప్పుపడితే అజయ్ కల్లం రెడ్డిని వదిలేసి… కేవలం చంద్రబాబే అన్నింటికీ బాధ్యు డని జగన్ ప్రభుత్వం ఆరోపించడం కక్షసాధింపుకాక మరేమిటి?

రాష్ట్రంలో జరుగుతున్న మద్యం అమ్మకాలు.. తయారీ… సరఫరా వంటి వ్యవహారాలపై సీబీఐ విచారణ కోరాకే జగన్..గత ప్రభుత్వ నిర్ణయాల్లోని తప్పొప్పులు వెతకాలి
రాష్ట్రంలో జరుగుతున్న మద్యం మాఫియా.. జగన్ సాగిస్తున్న దోపిడీపై టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాడన్న అక్కసుతో.. తన కక్షసాధింపుల్లో భాగంగానే ప్రభుత్వం చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టింది. ఈప్రభుత్వం నిజంగా మద్యం టెండర్లు.. అమ్మకాలు.. మద్యం తయారీలో ఎలాంటి తప్పు చేయకుంటే, తక్షణమే రాష్ట్రంలోజరుగుతున్న మద్యం వ్యాపారంపై సీబీఐ విచారణ కోరాలి. వాసుదే వ రెడ్డి నిజంగా నిజాయితీపరుడే అయితే అతని నేత్రత్వంలో మద్యం వ్యాపారానికి సబంధించి తీసుకున్న ప్రతి నిర్ణయం.. జరిగిన ప్రతి వ్యవహారంపై కూడా ప్రభుత్వం సీబీఐ విచారణ కోరాలి.

పేదల రక్త మాంసాలు అమ్ముకుంటూ మద్యం వ్యాపారం సాగిస్తున్న ముఖ్యమంత్రి, రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో ఎందుకు నగదురహిత చెల్లింపులు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలి. మద్యం అమ్మకాలపై వచ్చే సొమ్ము లో ఖజానాకు చేరుతున్నది ఎంతో.. తాడేపల్లికి చేరుతున్నది ఎంతో తేలాలంటే తక్షణమే జగన్ ప్రభుత్వం కేంద్రప్రభుత్వంతో సంప్రదించి సీబీఐ విచారణకోరాలి.” అని సాంబ శివరావు డిమాండ్ చేశారు.

Leave a Reply