శ్రీ స్వరూపానందేంద్ర స్వామి వారి ఆశిస్సులు అందుకున్న శిద్దా రాఘవరావు

విశాఖపట్నం చిన ముషీవాడ శారద పీఠం శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర స్వామి వారి ఆశిస్సులు అందుకున్న మాజీమంత్రి శిద్దా రాఘవరావు,శిద్దా సుధీర్ కుమార్

విశాఖపట్నం శ్రీ శారదా పీఠం వార్షికోత్సవం సందర్భంగా ఆశ్రమంలో ప్రత్యేక పూజలు చేసి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహా స్వామి,పీఠం ఉత్తరాధికారి శ్రీ స్మాత్య్రానందేంద్ర సరస్వతి స్వామి వారి ఆశిస్సులు అందుకున్న శిద్దా రాఘవరావు, శిద్దా సుధీర్ కుమార్.ఈ సందర్భంగా శిద్దా రాఘవరావు, శిద్దా సుధీర్ కుమార్ స్వామి వారికి ఫల పుష్పాలు సమర్పించారు. పీఠంలో వేంచేసి ఉన్న రాజశ్యామల అమ్మవారికి నిర్వహించిన నిత్య పీఠ పూజ,శారదా స్వరూప రాజశ్యామల మహా మంగళ హారతి కార్యక్రమంలో శిద్దా రాఘవరావు శిద్దా సుధీర్ కుమార్ పాల్గొని పూజలు నిర్వహించి అమ్మవారి ఆశిస్సులు అందుకున్నారు.శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామి శిద్దా రాఘవరావు శిద్దా సుధీర్ కుమార్ కు అమ్మవారి తీర్థప్రసాదాలు శేష వస్త్రాలు అందచేసి ఆశిస్సులు అందచేసారు.