Suryaa.co.in

Andhra Pradesh

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయానికి పెద్దపీట

-మొత్తం 18 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
-18 స్థానాల్లో బీసీలకు 11, ఎస్సీలకు 2, ఎస్టీ–1, ఓసీలకు 4 ఎమ్మెల్సీ స్థానాలు
-బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 67 శాతం పదవులు
-సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో ఒక్క బీసీలకే 43 శాతం పదవులు
-చంద్రబాబు హయాంలో ఓసీలు 62.5 శాతం, బీసీలు 32 శాతం
-అభ్య‌ర్థుల వివ‌రాల‌ను వెల్ల‌డించిన వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

తాడేపల్లి: సామాజిక న్యాయానికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. శాస‌న మండ‌లిలో ఖాళీ స్థానాల భ‌ర్తీలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పెద్దపీట వేశారు. బీసీలంటూ బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు.. బ్యాక్‌బోన్‌ క్లాస్ అని మ‌రోసారి రుజువు చేస్తూ సీఎం వైయ‌స్ జగన్‌ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చాం. ఓట్ల కోసం నినాదాలు ఇచ్చే పార్టీ మాది కాదు. వారిని అధికారంలో భాగస్వామ్యం చేశామ‌ని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. సోమ‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో 18 ఎమ్మెల్సీ స్థానాల‌కు వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థుల‌ను స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. శాసన మండలికి స్థానిక సంస్థల నుంచి జరుగుతున్న ఎన్నికలు, కొద్ది రోజుల్లో జరుగనున్న ఎమ్మెల్యే కోటా, గవర్నర్‌ కోటా ఎన్నికకు సంబంధించి సీనియర్‌ లీడర్లతో చర్చించి పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్లు పైనలైజ్‌ చేశారు. మాములుగా అయితే ఈ రోజు 9 పేర్లు మాత్రమే ప్రకటించాలి. మిగిలిన వాటికి సమయం ఉంది. గ్రాడ్యుయేట్స్, టీచర్ల ఎన్నికలు జరుగుతున్నాయి. సహాజంగానే వైయస్‌ఆర్‌ సీపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ ఉంది. పోటీకి పెద్దగా ఆస్కారం లేనికారణంగా స్థానాల్లో ఎన్నిక లాంఛానప్రాయం అయ్యింది.

వైయస్‌ఆర్‌సీపీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సాధికారతకు తొలి నుంచి పెద్ద పీట వేస్తోందనే విషయం అందరికీ తెలిసిందే. మా పార్టీ అధ్యక్షులు ఫైనల్‌ చేసిన పేర్లుఈ రోజే ప్రకటిద్దామని పార్టీ నిర్ణయించింది. ఆ మేరకు మీ ముందుకువచ్చాను. 2019లో పార్టీ అధికారంలోకి రావడానికి ముందు బీసీ అధ్యాయన కమిటీ ఏర్పాటు చేశాం. వివిధ వర్గాలకు సంబంధించి అధ్యాయనం చేశాం. బీసీలకు సంబంధించినంత వరకు బ్యాక్‌ వర్డ్‌ క్లాస్‌ కాదు..బ్యాక్‌ బోన్‌ క్లాస్‌ అని మేం భావిస్తున్నాం. అదే వైయస్‌ జగన్‌ విధానం. మా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇదే పాటిస్తున్నాం.

తొలి కేబినెట్‌ నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం. వెనుకబడిన తరగతుల నుంచి స్పీకర్‌ పదవి ఇవ్వడం జరిగింది. మండలి చైర్మన్‌ ఎంపికకు మా పార్టీకి అవకాశం రావడంతో ఎస్సీలకు అవకాశం కల్పించాం. డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మైనారిటీ మహిళను నియమించాం. వెనుకబడిన తరగతుల సంక్షేమం అన్నది ఒక నినాదం కాదు..అది వైయస్‌ జగన్‌ విధానం అనిప్రతి అడుగులోనూ, చర్యలోనూ ప్రస్ఫూటంగా కనిపిస్తోంది. పార్టీ మొత్తం కూడా నిజమైన సాధికారత దిశగా అడుగులు వేయడం అన్నది ఎంత మంచి పరిణామో అని అర్థ«ం చేసుకోవడం వల్ల ఓట్ల కోసం నినాదాలు ఇవ్వడం, కులాలను చీల్చడం కాకుండా, విస్తృతమైన విధానాలతో ప్రజల్లోకి వెళ్తుండటంతో దాని ఫలితాలు కూడా ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చూశాం. ఒక సానుకూల ఫలితాలు వచ్చాయి. నిజమైన సాధికారత స్ఫూర్తికి పూర్తి అర్థం వచ్చేలా అమలులోకి రావాలన్నదే వైయస్‌ఆర్‌సీపీ చూపించింది. వైయస్‌ జగన్‌ దానికి తగినట్టుగానే మరింత ముందుకు తీసుకెళ్లేలా ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు.

ఈ రోజు పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఒక్కసారి గమనిస్తే..రాజకీయ పార్టీ విధానాలు, నిర్ణయాలు, అమలులో గీటురాయి ఏంటంటే..కన్సిస్టేంట్‌గా ముందుకు తీసుకెళ్లడమే. దానికి అవసరమైన సీరియస్‌నెస్‌ ఇచ్చి అమలు చేయడమే. ఇదే మా పాలనలో జరుగుతోంది. గతంలో ఏ రోజు కూడా వీటి గురించి వాడుకోవడం తప్ప, బీసీల సంక్షేమం, సాధికారత అని నినాదంగా పెట్టుకున్న టీడీపీ తన హయాంలో ఏం చేసిందో గమనిస్తే..ఆ పార్టీ కానీ, ఆ పార్టీ అధినేత చెబుతున్న మాటల్లో ఢొల్లతనం బయటపడుతుంది. ఈ రోజు లెక్కలన్నీ తీసి చూస్తే..రకరకాల సమీకరణలు చూడాలి. దానికి అవసరమైన నాయకులను తయారు చేసుకోవడం, ప్రత్యార్థులను దృష్టిలో పెట్టుకొని ధీటుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులే. ఇందులో చంద్రబాబు ఢొల్లతనం చూస్తే..2014–2019లో టీడీపీ తరఫున 48 మందిని పంపగలిగారు. అందులో 30 మంది ఓసీలు, కేవలం 18 మంది మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు. బీసీలు 12 మంది, ఎస్సీ 3, ఎస్టీలు–1, మైనారిటీలు ఇద్దరు. అంటే 62.5 శాతం ఓసీలకు ఇచ్చారు. 37.5 శాతం మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు టీడీపీ ఇచ్చింది. సేఫ్‌గా పంపడానికి అవకాశం ఉన్న చోట ఎందుకు చేయలేకపోయారు. ఎందుకంటే వారికి చిత్తశుద్ధి లేదు. గెలిచే అవకాశం లేదని తెలిసీ కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వర్ల రామయ్యను పోటీకి దించారు. సేఫ్‌గా సీటు వచ్చే సమయంలో వర్ల రామయ్యకు అవకాశం ఇవ్వలేదు. ప్రకాశం బ్యారేజీ వద్దకు వచ్చినతరువాత సీటు లేదని చెప్పడంతో ఆయన వెనక్కి తిరిగింది అందరూ చూశాం. అది చంద్రబాబు నిజాయితీ, నిబద్ధత.

వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన ప్పటి నుంచి నిన్నటి వరకు గమనిస్తే..32 స్థానాలు ఉంటే అందులో 18 బీసీ, ఎస్సీ, మైనారిటీలు ఉన్నారు. అంటే 56 శాతం ఆ వర్గాలకు ఇచ్చాం. ఇప్పుడు ఐదు ఖాళీలు వస్తే 26 మంది వైయస్‌ఆర్‌సీపీలు ఉన్నారు. మొత్తం 44 స్థానాలు ఉన్నాయి. ఈ రోజు వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం, విప్లవాత్మకమైనది. మొత్తం దేశంలో కళ్లు మూసుకొని చెప్పవచ్చు. నిజమైన సామాజిక న్యాయం కోసం దూరదృష్టితో తీసుకున్న నిర్ణయంగా చెప్పవచ్చు. 11 మంది బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీ, మైనారిటీలు నలుగురు ఉన్నారు. ఈ రోజు వైయస్‌ జగన్‌ అందరితో చర్చించి అప్రూవల్‌ చేసిన నంబర్‌ నుంచి చూస్తే..18 స్థానాల్లో 11 మంది బీసీలు అంటే 43 శాతం.. శాసనమండలిలో జులై తరువాత వైయస్‌ఆర్‌సీపీకి 19 మంది బీసీలు, ఆరుగురు ఎస్సీలు, ఒకరు ఎస్టీ, మైనారిటీలు నలుగురు, 14 మంది ఓసీలు ఉంటారు. అంటే బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు 68.18 శాతం, ఓసీలు 31.8 శాతం. ఇది శాసన మండలిలో వైయస్‌ఆర్‌సీపీ అంకితభావంతో తీసుకున్న నిర్ణయం ప్రకారం..సమీప భవిష్యత్‌లో మండలిలో ఈ లిస్ట్‌ కనిపిస్తుంది. రాజకీయ సాధికారత లోకల్‌ బాడీ నుంచి చట్ట సభల వరకు వైయస్‌ జగన్‌ అవకాశం కల్పిస్తూ..సెఫ్‌గా ఉండే విధంగా అన్ని వర్గాల నుంచి తీసుకువచ్చి అధికారంలో భాగస్వామ్యం కల్పించడం వైయస్‌ జగన్‌కు, వైయస్‌ఆర్‌ సీపీకి మాత్రమే చెందుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

స్థానిక సంస్థలు..
– నత్తు రామారావు.. శ్రీకాకుళం, లోకల్‌ కోటా (బీసీ, యాదవ)
– కుడుపూడి సూర్యనారాయణ.. తూర్పు గోదావరి, లోకల్‌ కోటా (బీసీ-శెట్టి బలిజ)
– వంకా రవీంద్రనాథ్‌.. పశ్చిమ గోదావరి,‍ లోకల్‌ ​కోటా (పారిశ్రామికవేత్త)
– కవురు శ్రీనివాస్‌.. ప.గోదావరి, లోకల్‌ కోటా( బీసీ-శెట్టి బలిజ)
– మేరుగ మురళి.. నెల్లూరు, లోకల్‌ కోటా (ఎస్సీ-మాల)
– డా. సిపాయి సుబ్రహ్మణ్యం.. చిత్తూరు, లోకల్‌ కోటా
– రామసుబ్బారెడ్డి.. కడప, లోకల్‌ కోటా (ఓసీ-రెడ్డి)
– డాక్టర్‌ మధుసూదన్‌.. కర్నూలు, లోకల్‌ కోటా (బీసీ-బోయ)
– ఎస్‌. మంగమ్మ.. అనంతపురం, లోకల్‌ కోటా( బీసీ-బోయ)

ఎమ్మెల్యే కోటా..
– పెనుమత్స సూర్యనారాయణ.. విజయనగరం, ఎమ్మెల్యే కోటా( క్షత్రియ సామాజిక వర్గం)
– పోతుల సునీత.. ప్రకాశం, ఎమ్మెల్యే కోటా (బీసీ- పద్మశాలి)
– కోలా గురువులు.. విశాఖ, ఎమ్మెల్యే కోటా (ఫిషరీస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌)
– బొమ్మి ఇ‍జ్రాయిల్‌.. తూ. గోదావరి, ఎమ్మెల్యే కోటా ( ఎస్సీ-మాదిగ)
– జయమంగళ వెంకటరమణ, ప. గోదావరి, లోకల్‌ కోటా (వడ్డీల సామాజిక వర్గం)
– ఏసు రత్నం.. గుంటూరు, ఎమ్మెల్యే కోటా ( బీసీ-వడ్డెర)
– మర్రి రాజశేఖర్‌.. గుంటూరు, ఎమ్మెల్యే కోటా ( కమ్మ)

గవర్నర్‌ కోటా..
– కుంభా రవి.. అల్లూరి జిల్లా, (ఎస్టీ)
– కర్రి పద్మశ్రీ.. కాకినాడ, (బీసీ)

LEAVE A RESPONSE