విజయ డెయిరీ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు

తెలంగాణ విజయ డెయిరీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 17 లక్షల రూపాయలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ క్రింద వివిధ సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.సోమవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసం వద్ద అఫ్జల్ గంజ్ చుడి బజార్ లో నిర్వహిస్తున్న రెయిన్ బో హోమ్ కు తెలంగాణ విజయ డెయిరీ ద్వారా ప్రతి రోజు 20 లీటర్ల పాలను ఉచితంగా సరఫరా చేసేలా అనుమతిస్తూ జారీ చేసిన పత్రాన్ని నిర్వాహకులకు మంత్రి అందజేశారు. సొసైటీ ఫర్ రూరల్ డెవలప్ మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో చుడి బజార్ లో నిర్వహిస్తున్న రెయిన్ బో హోమ్ లో ఉన్న 93 మంది బాలికల కోసం ప్రతిరోజు 20 లీటర్లు చొప్పున సంవత్సరం పాటు పాలను ఉచితంగా సరఫరా చేయనున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు. సొసైటీ నిర్వహకులు శ్రీనివాస్ రెడ్డి, శివరాణి లు మంత్రి చేతుల మీదుగా ఉచితంగా పాల సరఫరా కు సంబంధించిన పత్రాన్ని అందుకున్నారు.

Leave a Reply