Suryaa.co.in

Andhra Pradesh

కోనసీమ జొన్నాడలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వీరంగం..

బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు జొన్నాడ వద్ద అడ్డుకున్నారు.. రావులపాలెం వెళ్తున్న సమయంలో జొన్నాడ వద్ద వీర్రాజును అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమలాపురం: బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ను బుధవారం నాడు పోలీసులు అడ్డుకున్నారు. తమ పార్టీకి చెందిన నేత కుటుంబ సభ్యులను పరామర్శకు వెళ్లే సమయంలో జొన్నాడ వద్ద ఆయనను అడ్డుకోవడంపై పోలీసులపై బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజమండ్రి నుండి ఇవాళ ఉదయం సోము వీర్రాజు రావులపాలెం వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. రావుల పాలెంలో తమ పార్టీ కార్యకర్త కుటుంబ సభ్యులను పరామర్శకు వెళ్తుండగా జొన్నాడ వద్ద సోము వీర్రాజును జాతీయ రహదారిపై పోలీసులు అడ్డుకున్నారు. ఉన్నతాధికారులు అడ్డుకోవాలని చెప్పడంతోనే తాము ఆపాల్సి వచ్చిందని పోలీసులు సోము వీర్రాజు కు చెప్పారు. దీంతో ఆగ్రహం పట్టలేకపోయిన సోము వీర్రాజు అక్కడే విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ దుర్గాప్రసాద్ ను నెట్టివేశాడు.

ఉన్నతాధికారుల ఆదేశాలున్నాయని ఎస్ఐ దుర్గా ప్రసాద్ చెప్పాడు. ఎస్పీతో మాట్లాడుతానని ఎస్పీకి ఫోన్ కలిపి ఇవ్వాలని సోము వీర్రాజు ఎస్ఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కారుకు అడ్డుగా పెట్టిన భారీ వాహనాన్ని కూడా తీసివేయాలని ఆ లారీ డ్రైవర్ పై కూడా సోము వీర్రాజు కోపంతో ఊగిపోయారు. ఎవరు

చెబితే తన కారుకు లారీని అడ్డంగా నిలుపావని డ్రైవర్ పై వీర్రాజు ప్రశ్నించారు. లారీ డ్రైవర్ కూర్చొన్న క్యాబిన్ లో డోర్ ను వీర్రాజు ప్రశ్నించాడు. ఈ సమయంలో ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపిన స్థానిక ఎస్ఐ సోము వీర్రాజును రావులపాలెంకు తరలించేందుకు అంగీకరించారు.

ఆంక్షలు, పోలీస్ భద్రతతో ఎంత కాలం పాలిస్తారని సోము వీర్రాజు ప్రశ్నించారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కును ఎవరిచ్చారని ఆయన అడిగారు. ఏపీలో ఏం జరుగుతుందో తెలియని గందరగోళం నెలకొందన్నారు వీర్రాజు మీడియాతో అన్నారు.

కోనసీమ జిల్లాలోని 12 మండలాల రైతులు క్రాప్ హాలిడే పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే క్రాప్ హాలిడే ప్రకటించిన రైతులకు మద్దతు తెలిపేందుకు వీర్రాజు వెళ్తారేమోననే అనుమానంతో పోలీసులు అడ్డుకున్నారని సమాచారం

LEAVE A RESPONSE