విద్యా రంగాన్ని బ్రష్టు పట్టిస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం

-ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్

విజయవాడ : రాష్ట్రంలో విద్యా రంగాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం బ్రష్టు పట్టిస్తోందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ఆరోపించారు. పదవ తరగతి ఫలితాల్లో జగన్ రెడ్డి హయాంలో 67.26 శాతానికి పడిపోయిందని విమర్శించారు. జగన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క డీఎస్సీ కూడా జరపలేదనీ, ఉపాధ్యాయ నియామకాలు జరపనందునే విద్యార్దులు ఉత్తీర్ణత, ప్రమాణాలు దిగజారాయని ఆరోపించారు. ఉపాధ్యాయుల నియామకాలపై పెట్టలేదని,నాడు- నేడులో రూ.3,500 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

రెండు లక్షల మంది టెన్త్ విద్యార్థులు ఫెయిల్ అవడం ముమ్మాటికి ప్ర‌భుత్వ వైఫ‌ల్యమేనని శైలజనాథ్ విమర్శించారు. మంగళవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో దీనిపై సీబీఐతో స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించాలని డిమాండ్ చేశారు. టీచర్లను ప్రభుత్వం మానసికంగా వేధించిందని, ఫలితాలు ప్రకటిస్తామన్న తేదీన కాకుండా మూడు రోజులు ఆలస్యం ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. అమ్మఒడి భారం తగ్గించుకునేందుకనే అనుమానం కలుగుతోందన్నారు.

పాఠశాలల్లో విద్యార్ధుల అడ్మిషన్ నుంచి ఫలితాల వెలువడించేంత వరకు ప్రతి దశలోను ప్రభుత్వం వైఫల్యం అయ్యిందని, ప్రశ్నా పత్రాలు లీక్ చేసి విద్యార్ధుల జీవితాలతో ఆటలాడారని పేర్కొన్నారు. మూడేళ్ల పాటు విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో నేడు పదవ తరగతి ఫలితాలు చూస్తే అర్ధమవుతున్నాయని, వైసీపీ పాలనలో మొట్ట మొదటి పదవ తరగతి ఫలితాలు కేవలం 67.26 శాతం మాత్రమే రావడం సిగ్గుచేటు అని అన్నారు. విద్యా ప్రమాణాలు దిగజారిపోయాయనడానికి ఇంతకంటే నిదర్శనం మరొక్కటి లేదని, జగన్ రెడ్డి మొదటి రెండేళ్ల కరోనా ఉండటంతో నూటికి నూరు శాతం ఫలితాలు వచ్చాయి. కాని నేడు అసలు రంగు భయటపడింది. కేవలం విద్యా శాఖా మంత్రి అహంతో విద్యార్ధుల ఫలితాలు ఆలస్యం చేసి అపహాస్యం చేశారన్నారు.

6.22 లక్షల మంది గాను 4,14,281 లక్షల మంది ఉత్తీర్ణత అంటే దాదాపు 2 లక్షల మంది విద్యార్ధుల భవిష్యత్ ను అంథకారం చేసిన జగన్ రెడ్డి నాణ్యమైన విద్యలో 3వ స్థానం నుంచి 19వ స్థానానికి దిగజార్చారని విమర్శించారు. పదవ తరగతి విద్యార్ధులకు పరీక్షల సమయంలో సరైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని, జగన్ రెడ్డి చేతగాని పాలనతో విద్యార్ధుల భవిష్యత్ ను అంథకారంలోకి నెట్టేస్తున్నారని ఆరోపించారు. ఆంగ్ల మాధ్యమం మోజులో మాతృభాషకు తూట్లు పొడిచారని, ఒక్క డీఎస్సీ జరపకుండా 20వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయలేకపోగా ఉపాధ్యాయులచే మద్యం షాపుల ముందు నిలబెట్టిన ఘనత జగన్ రెడ్డికే దక్కిందన్నారు. కరోనా సమయంలో దాదాపు 1500 మంది ఉపాధ్యాయులు చనిపోతే జగన్ రెడ్డి వారి కుటుంబాలను ఆదుకోలేదని, జగన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారన్న కక్షతో కుట్ర పూరితంగా బయోమెట్రిక్ లు ఏర్పాటు చేశారన్నారు. పీఆర్సీ అమలు చేయమని, సీపీఎస్ రద్దు చేయమని కోరినందుకు ఉపాధ్యాయులను అవమానాలకు గురి చేశారని ఆరోపించారు.

Leave a Reply