సజ్జల ప్రధాన సలహదారు కాదు ప్రధాన బ్రోకర్

• జనసేన గ్రాఫ్ పెరుగుతుందనే వైసీపీ ఉలిక్కిపడుతోంది
• మీడియా సమావేశంలో జనసేన పార్టీ రాజమండ్రి నగర అధ్యక్షులు యర్నాగుల శ్రీనివాస్

ప్రభుత్వ ప్రధాన సలహాదారు, సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి నిత్యం చేస్తున్న బ్రోకరేజ్ పనులు, మధ్యవర్తిత్వాల మీద… అవి ఎలాంటి పనులో వెల్లడయ్యేలా కేంద్రం దర్యాప్తు జరిపించాలని జనసేన పార్టీ రాజమహేంద్రవరం నగర అధ్యక్షులు యర్నాగుల శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన సజ్జల కోటీశ్వరుడు ఎలా అయ్యిందీ,ఎన్ని బ్రోకరేజ్ పనులు చేసిందీ చెప్పాలన్నారు. ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులను ముఖ్యమంత్రితో కలవకుండా అడ్డుపడుతున్నది ఆయనే అని వైసీపీ వాళ్ళే చెబుతున్నారు అని చెప్పారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై సజ్జల చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. బుధవారం రాజమండ్రిలో పార్టీ నాయకులతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా యర్నాగుల శ్రీనివాస్ మాట్లాడుతూ “జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఎవరినీ వ్యక్తిగతంగా అనరు. అలాగే విమర్శించే సమయంలోనూ గౌరవప్రదమైన భాష వాడతారు. సజ్జలని కూడా గౌరవవాచకంతోనే సంబోధిస్తారు. వైసీపీ నాయకులు మాత్రం పైత్యంతో మాట్లాడుతున్నారు.

నిరంతరం రాష్ట్ర క్షేమం, అభివృద్ధి కోసం ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ . అధికారం కోసం పాకులాడేవారే అయితే 2014లో జనసేన పార్టీ మద్దతుతో బీజేపీ, టీడీపీలు ప్రభుత్వం స్థాపించాయి. ఆ ప్రభుత్వంలో జనసేన భాగస్వామి కాలేదు. ప్రభుత్వం నుంచి ఏ లబ్దీ లేదన్న సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.

• మీ అధికారం పవన్ కళ్యాణ్ చలవే
ఈ రోజున మీకు దక్కిన అధికారం కూడా పవన్ కళ్యాణ్ చలవేనన్న సంగతి సజ్జల, ఆయన బాస్ సిబిఐ దత్తపుత్రుడు గుర్తు పెట్టుకోవాలి. 2019లోనూ టీడీపీ, జనసేన కలసి పోటీ చేస్తే మీ పరిస్థితి ఏమయ్యేదో ఆలోచించుకోండి. పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం అంటే మీకెందుకంత ఉలికిపాటు. వైసీపీవాళ్లు మూడేళ్ల పాలనలో చేసిన అరాచకాలన్నీ ప్రజలందరికీ తెలుసు.

• జగన్ ఏ1… సజ్జల బీ1
సజ్జల రామకృష్ణారెడ్డి మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి. ఆయన వ్యవహారాలు ఆయన చేసే బ్రోకరేజీలు బయటకు తీసుకువస్తాం. వైసీపీ అధినాయకుడు ఏ1 అయితే బ్రోకర్ పనులతో సజ్జల బీ1గా ఉన్నారు. చంచల్ గూడలో 17 నెలల జైలు జీవితం గడిపిన ఆర్దిక నేరగాడు ఏ1. కోర్టు అనుమతి తీసుకుంటే గాని దేశం దాటలేని పరిస్థితి ఆ నాయకుడిది. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే నైతిన హక్కు, స్థాయి వైసీపీ వాళ్ళకు లేవు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలన్న పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు లోబడి గౌరవంగా మాట్లాడుతున్నామన్న సంగతి వైసీపీ నాయకులు గుర్తుంచుకుంటే మంచిది.

జనసేన పార్టీకి ప్రజా ప్రయోజనాలే ముఖ్యం. రాష్ట్రానికి స్వచ్ఛమైన, సుపరిపాలన అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి బాధ్యత తీసుకోవాలన్నదే ఆయన ఆకాంక్ష. సొంత కష్టార్జితంతో ప్రజల కష్టాలు తీరుస్తున్న నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్ . ప్రభుత్వ విధానాల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న కౌలు రైతుల కోసం తన సొంత కష్టార్జితం నుంచి రూ. 5 కోట్లు ఇచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ . కౌలు రైతు భరోసా యాత్రతో జనసేన గ్రాఫ్ పెరుగుతుండడంతోనే వైసీపీ నాయకులు కంగారు పడుతున్నారు. తల్లకిందులుగా తపస్సు చేసినా 2024లో వైసీపీ అధికారంలోకి రాదు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతుంద”ని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర న్యాయ విభాగం వైస్ ఛైర్మన్ ఏవీఎన్ఎస్ రామచంద్రరావు, పార్టీ నాయకులు తేజోమూర్తిల నరసింహమూర్తి, దారసి గురునాథరావు, గుత్తుల సత్యనారాయణ, షేక్ బాషా లిమ్రా, నల్లంశెట్టి వీరబాబు,కప్పల సూర్యప్రకాష్,గౌరిశెట్టి చైతన్య కుమార్, పీవీవీ సత్యనారాయణ, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply