– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
వైసీపీ అరాచక పాలనను తరిమికొట్టి రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని స్ధాపించాలన్న లక్ష్యంతో నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రజల మద్దతుతో విజయవంతమైంది. ఈ నెల 20న విజయవగరం జిల్లా పోలిపల్లిలో యువగళం ముగింపు సభ నిర్వహిస్తున్నాం. ఈ సభకు హాజరయ్యేందుకు ప్రజలు, కార్యకర్తలు, అభిమానుల కోసం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 5 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశాం. ఈ ట్రైన్స్ 19 తేదీన ఆయా ప్రాంతాల నుంచి ప్రారంభమవుతాయి. ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుని పెద్ద ఎత్తున సభకు హాజరై విజయవంతం చేయాలని కోరుచున్నాము.
రైళ్ల వివరాలు
1. చిత్తూర్ నుంచి బయలుదేరే ట్రైన్ ఉదయం 11.00 కి స్టార్ట్ అవుతుంది. ట్రైన్ నెంబర్-00700/00701
ఉదయం 11.30 కి పాకాల లో ఆగుతుంది.
మధ్యాహ్నం 1.45 కి రేణిగుంట లో ఆగుతుంది.
2. తిరుపతి నుంచి బయలుదేరే ట్రైన్ మడ్యాహ్నం 2.00 కి స్టార్ట్ అవుతుంది. ట్రైన్ నెంబర్-00702/00703
మధ్యాహ్నం 3.00 కి శ్రీకాళహస్తిలో ఆగుతుంది.
మధ్యాహ్నం 3.30 కి వెంకటగిరిలో ఆగుతుంది.
సాయంత్రం 4.00 కి గూడూరులో ఆగుతుంది.
3. రైల్వే కోడూరు నుంచి బయలుదేరే ట్రైన్ ఉదయం 7.00కి స్టార్ట్ అవుతుంది. ట్రైన్ నెంబర్ 00704/00705
రాజంపేటలో ఉదయం 7.30 కి ఆగుతుంది.
కడప లో ఉదయం 8.15కి ఆగుతుంది.
ప్రొద్దుటూరు లో ఉదయం 9.10 కి ఆగుతుంది.
జమ్మలమడుగు లో ఉదయం 9.40కి ఆగుతుంది.
4. ధర్మవరం నుంచి బయలుదేరే ట్రైన్ : 00706/00707 (స్పెషల్ ట్రైన్)
ఉదయం 7.00 కి స్టార్ట్ అవుతుంది.
అనంతపురం లో ఉదయం 7.45 కి ఆగుతుంది.
గుత్తి లో ఉదయం 9.15 కి ఆగుతుంది.
5. నెల్లూరు నుంచి బయలుదేరి ట్రైన్ రాత్రి 8.00 కి స్టార్ట్ అవుతుంది. ట్రైన్ నెంబర్-00712/00713(స్పెషల్ ట్రైన్)
కావలి లో 8.30 కి ఆగుతుంది
ఒంగోలు లో 9.30కి ఆగుతుంది.