దోస్తీ-కుస్తీ నాటకాలు ఆపి ధాన్యం కొనుగోలుపై నిర్ణయం తీసుకోవాలి

– తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ
కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. తెలంగాణ గురించి కేసీఆర్ కే చెబుతారా? అంటే ప్రెస్ మీట్లలలో ఫైర్ అయ్యే కేసీఆర్ కు అసలు తెలంగాణ గురించి ఏ మీ తెలియదని.. రాష్ట్రానికి ఏమి కావాలో అసలు అవగాహన లేదు. టీఆర్ఎస్-బీజేపీలు ఇప్పటికైనా పగటి వేషగాళ్లలా దోస్తీ-కుస్తీ నాటకాలు ఆపి ధాన్యం కొనుగోలుపై నిర్ణయం తీసుకోవాలి.
తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సదస్సులో.. తెలంగాణ విభజన చట్టంలో నాటి కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన వాటి గురించి ప్రస్తావన అయినా కేసీఆర్ ప్రభుత్వం చేసిందా?
ఐటీఐఆర్ పార్క్, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవన్నీ విభజన చట్టంలోని అంశాలే.. వీటిపైనా ఈ ఏడేళ్లలో ఏనాడైనా బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసిందా.. కనీసం అడిగిందా?మోదీ ప్రభుత్వానికి ఏడేళ్లుగా పార్లమెంట్ లో అండగా నిలిచిన కేసీఆర్.. ఇప్పుడు గల్లీల్లో నాటకాలు అండగా నిలిచాడు.
కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లుగా… ఇప్పుడు కేటీఆర్.. కేంద్రంతో కుస్తీ పడుతున్నట్లు పెద్దపెద్ద డ్రామాలు ఆడుతున్నాడు.కేంద్రం నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు లేవని అంటున్నాడు.. అంటే ఇన్నేళ్లనుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలు తీసుకురాలేకపోయాని నిస్సిగ్గుగా కేసీఆర్ ప్రభుత్వం అంగీకరించినట్లే.
కేసీఆర్ ప్రభుత్వానికి బీజేపీతో కుస్తీ డ్రామాలు ఆడేందుకు సమయం ఉంటుంది కానీ.. ధరలు తగ్గి అయోమయంలో ఉన్న పత్తి రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకు సమయం ఉండదు. కేవలం వారం రోజుల్లోనే క్వింటాలు పత్తికి రూ. 1000 తగ్గింది. వరంగల్ జిల్లా సహా ఎనుమాముల మార్కెట్ సహా ఇదే పరిస్థితి ఉందని పత్రికల్లో వస్తోంది. దీనిపై సంబంధిత మంత్రి గానీ.. ముఖ్యమంత్రి గానీ రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా నిర్ణయాలు తీసుకోవాలి.

Leave a Reply