క్షణాల్లోనే సముద్రంలో మునిగిపోయిన “మై సాగా’..అంతా

వందల కోట్లు విలువచేసే ఓడ చూస్తుండగానే క్షణాల్లో మునిగిపోయింది. దక్షిణ ఇటలీ సముద్ర తీరంలో శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఓడలో ఉన్న 9 మందిని సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడారు.40 మీటర్ల ఈ ఓడ పేరు ‘మై సాగా’. 2007లో ఇటలీలోనే తయారు చేశారు. గల్లిపోలి నుంచి మిలాజోకు వెళ్లే క్రమంలో కెటన్‌జారో మెరీనా తీరంలో ప్రమాదవశాత్తు మునిగిపోయింది. ముందుగా ఓడ కుడివైపు కొంత భాగం మునిగింది. ఆ తర్వాత క్షణాల్లోనే ఓడ మొత్తం సముద్రంలో మునిగిపోయింది. ఈ దృశ్యాలను ఇటలీ కోస్ట్ గార్డు సిబ్బంది రికార్డు చేశారు.