– గిరిజన భూముల కబ్జాపై సీఎం బాబును కలిసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
అమరావతి: ముదిగుబ్బ మండలంలో అడవి బ్రాహ్మణపల్లి తండా గ్రామంలో గిరిజన రైతులకు చెందిన భూ కబ్జాల విషయమై బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా రామకృష్ణ సీఎం చంద్రబాబు తో మాట్లాడుతూ ముదిగుబ్బ మండల పరిధిలోని ఏబి పల్లి తాండ గ్రామంలో మండల ఎంపిపి ఆదినారాయణ యాదవ్ వందల ఎకరాలు భూములు కబ్జా చేసి, గిరిజన రైతులను మోసం చేశాడని చంద్రబాబుకు వివరించారు, ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిపిఐ రామకృష్ణ తో మాట్లాడుతూ, రెవెన్యూ శాఖ నుంచి తగిన నివేదికలు తెప్పించుకుని, త్వరలోనే ఈ విషయంపై చర్యలు తీసుకుంటామని రామకృష్ణకు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో రామకృష్ణ తో పాటు సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, ఆ పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ అయిన జెల్సి విల్సన్ తదితరులు పాల్గొన్నారు,