Suryaa.co.in

Telangana

ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లండి

– పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పదవీ ప్రమాణ స్వీకారసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పిలుపు

హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న మహేష్ కుమార్ గౌడ్ ను మనస్పూర్తిగా అభినందిస్తున్న. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆదేశాలు, రాహుల్ గాంధీ గారి ఆలోచన, సోనియా గాంధీ ఆశీస్సులతో పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకం చేసినందుకు ఏఐసిసికి కృతజ్ఞతలు.

ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను, లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికి తీసుకు వెళ్లే విధంగా పిసిసి నూతన అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కార్యక్రమం చేపట్టాలి.

10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ శ్రేణులు అనేక పోరాటాలు చేసి కేసులను, నిర్బంధాలను ఎదుర్కొని అవమానాలు భరించి, అచంచలమైన పట్టుదలతో పార్టీ జెండాను భుజాన మోసుకొని అధికారంలోకి తీసుకురావడానికి చేసిన కృషికి కృతజ్ఞతలు.

ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను, ఇంటింటికీ తీసుకువెళ్లి ఓట్లు అడిగి పార్టీని గెలిపించారు. కాంగ్రెస్ శ్రేణులు తలెత్తుకునే విధంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నది. శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, అసెంబ్లీ ప్రాంగణంలో మహిళల కోసం ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని ప్రారంభించాము.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్న డబ్బులను నెలకు 400 కోట్ల రూపాయలను, కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తున్నది.ఆరు గ్యారెంటీల హామీల అమలులో భాగంగా అర్హులైన ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును అందించే గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించాం.మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను సబ్సిడీపై అందిస్తున్నాం.

ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టబోతున్నాం. ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయల వరకు లబ్ధిదారులకు ఇవ్వబోతున్నది. గత పాలకుల విధానవల్ల కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ప్రతినెల 1వ తేదీన ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నాం.

దేశ చరిత్రలో 15 రోజుల్లోనే 18 వేల కోట్ల రూపాయలు, రైతు రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానిది. ప్రభుత్వ లక్ష్యాలను కాంగ్రెస్ శ్రేణులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి పార్టీని బలోపేతం చేయాలి. ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడినది ప్రజా ప్రభుత్వం. ప్రజల కోసం సంపద సృష్టిస్తాం. సృష్టించిన సంపదను ప్రజలకే పంచుతాం
కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే ప్రతి నాయకుడిని, కార్యకర్తను తప్పనిసరిగా పార్టీ గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులను పార్టీ గుర్తించి, కార్పొరేషన్ చైర్మన్ పదవులను కట్టబెట్టి గౌరవించింది.

ప్రజల కోసం అంకితభావంతో పార్టీ కోసం నిబద్ధతతో పని చేసే కాంగ్రెస్ నాయకులను కచ్చితంగా పార్టీ అధిష్టానం గుర్తిస్తుంది అనడానికి.. ఎన్ఎస్ యుఐ యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులను సమర్ధవంతంగా నిర్వహించి, పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ ఇందుకు నిదర్శనం.

LEAVE A RESPONSE