Home » బాబు విడుదల వేళ ఖతార్‌లో తమ్ముళ్ల సంబరాలు

బాబు విడుదల వేళ ఖతార్‌లో తమ్ముళ్ల సంబరాలు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిన సందర్భంగా ఖతార్ తెలుగుదేశం ఆధ్వర్యంలో భారీసమావేశం నిర్వహించుకున్నారు.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిన సందర్భంగా ప్రవాసులు పెద్దఎత్తున సమావేశమైనారు.. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చి కుటుంబసభ్యులతో ఉన్న విజువల్ చూసి ప్రవాసులు కన్నీటి పర్యంతమయినారు.

చంద్రబాబు నోటివెంట వెలువడిన మాటలు … ఏమి తమ్ముళ్లు.. ఎలా ఉన్నారు.. అన్న మాట చెవినపడగానే ప్రవాసులు పులకించిపోయారు.. చంద్రబాబు జైలునుంచి విడుదలైనారన్న సంతోషం, అక్రమకేసులలో 50 రోజులకు పైబడి నిర్బంధించారని భాధ, కలగలిసిన ఉద్వేగం అందరి ముఖాలలో ప్రతిబింబించింది .

ఈ సంధర్భముగా.. సమావేశముకు హాజరైన ప్రతి ఒక్కరు చంద్రబాబు కటౌట్లకు పాలాభిషేకం చేశారు.. ది బాస్ ఐస్ బ్యాక్ అని ముదించిన కేక్ కోసి ఒకరికొకరు తినిపించుకొన్నారు, స్వీట్స్ పంచుకొన్నారు.. ఈ సమావేశంలో, చంద్రబాబు అరెస్ట్ జరిగిన రోజు నుంచి ఈరోజు వరకు జరిగిన ప్రరిణామాలపైనా ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న తెలుగుప్రజలు చర్చించుకొంటున్న కొన్నివిషయాలు చర్చకు వచ్చాయి.

లక్షలమంది విద్యార్థులకు ఉపయోగపడే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ని ఏర్పాటుచేయడం తప్ప? ఒకవేళ కాంట్రాక్టు అస్సైన్డ్ చేసిన కంపెనీయో, వారి SUBCONTRACTORS , తప్పుచేస్తే దానికి ముఖ్యమంత్రి భాద్యులు ఎలాఅవుతారు? కాబినెట్ లో చర్చించి తీసుకొన్న నిర్ణయాలకు ముఖ్యమంత్రిని భాద్యుని చేసి కక్షసాధిస్తే.. ఇక దేశంలో ప్రతిపక్షాలు ఎలా మనుగడ సాధిస్తాయి?

అధికారంలో ఉన్న వాళ్లంతా ఈతరహాలో వ్యవహరిస్తే అది ప్రజాస్యామ్య మనుగడకి గొడ్డలిపెట్టుకదా ? అధికారం ఉంటే పోలీస్ వ్యవస్థను ప్రతిపక్షంలో ఉన్నవారి పైన ప్రయోగిస్తే , అది పెత్తనందారీ స్యామ్యం అవుతుంది కానీ ప్రజాస్యామ్యం ఎలావుతుంది?

ఈవిషయాలు ప్రజావేదికలపై చర్చించవలసిన సమయం ఆసన్నమయినదని .. విద్యావంతులు, మేథావులు, ప్రజాస్వామ్య వాదులు బయటకువచ్చి, రాష్ట్రంలో జరుగుతున్న విపరీత పోకడలను ప్రశ్నించాలని, మేధావులుగా ముద్రపడ్డవారు నీతివంతంగా వ్యాపారం చేస్తున్న వారిపై కాకుండా, ఈ ధమన కాండ పైన వారి విస్పష్ట అభిప్రాయాలను ఇకనైనా చెప్పాలని, ప్రవాసులు వేడుకొన్నారు ..ప్రజలకు ఈ విషయాలు వివరించి చెప్పాలని తీర్మానించారు.

Leave a Reply