Home » చంద్రబాబు నాయుడు విడుదల సందర్భంగా మొక్కుబడులు చెల్లించుకున్న టీడీపీ శ్రేణులు

చంద్రబాబు నాయుడు విడుదల సందర్భంగా మొక్కుబడులు చెల్లించుకున్న టీడీపీ శ్రేణులు

మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు విడుదల సందర్భంగా అనంతపూర్ అర్బన్ లోని రుద్రంపేట ఉన్న రామాలయంలో సీత రాములు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజోలు నియోజకవర్గంలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు తాటిపాక నుండి అంతర్వేది దేవస్థానం వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలసి సైకిల్ యాత్ర నిర్వహించారు.

పత్తికొండ నియోజకవర్గం ఎర్రగుడిలో ఇంఛార్జ్ కేఈ శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీరామలింగేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. తిరువూరు నియోజకవర్గం పుట్రేల గ్రామంలో మారెమ్మ తల్లి దేవస్థానంలో చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనకాపల్లిలో పీలా గోవింద సత్యనారాయణ ఆధ్వర్యంలో అనకాపల్లి పట్టణంలోని 81వ వార్డులో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామీ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మిగనూరులో డా బి వి జయనాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో నందవరం గ్రామంలో గల ఆంజనేయ స్వామి దేవాలయం యందు 101 టెంకాయలు కొట్టారు. పొలతల పుణ్యక్షేత్రంలో పుత్తా చైతన్య రెడ్డి గారు, పుత్తా లక్ష్మీ రెడ్డి ప్రత్యేక పూజలతో పాటు 1001 కొబ్బరికాయలు కొట్టి మొక్కుబడి చెల్లించారు.

Leave a Reply