Suryaa.co.in

Andhra Pradesh

బడుగులకు టీడీపీ గొడుగు

– ఎమ్మెల్సీ బీద రవిచంద్ర

నెల్లూరు: రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రెండవసారి శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన బీదకి అభినందన సభ జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ఏమన్నారంటే.. కష్టపడే కార్యకర్తలకు టీడీపీలో మాత్రమే గుర్తింపు ఉంటుంది. నాలాంటి ఎంతోమంది సామాన్యులను చట్టసభలకు పంపిన ఘనత టీడీపీదే. మనది బడుగుల పార్టీ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం పోరాడిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుంది. ఇందులో ఎవరికీ అనుమానాలు అవసరం లేదు. నాకు ఎమ్మెల్సీ పదవి దక్కిందంటే అది మీ అందరికీ దక్కినట్లే. ఇది పదవి కాదు. బాధ్యతగా భావిస్తా. నెల్లూరులో పార్టీని తిరుగులేని శక్తిగా మార్చేందుకు నా శక్తిమేరకు కృషి చేస్తా.

శ్రీధర్ అన్నతో నాకు 35 ఏళ్ళ అనుబంధం. కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చేదాంట్లో రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ మొదటి స్థానంలో ఉంది. ఒకేరోజు 105 శంకుస్థాపనలు ప్రజలచేత చేయించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సంతోషించారు. పొట్టేపాళెం, ములుముడి కలుజులపై వంతెనల నిర్మాణానికి బాధ్యత తీసుకుంటా

LEAVE A RESPONSE