ప్రజాగళం సభలో రాజ్యసభ ఎంపి సిఎం రమేష్ ప్రసంగం
జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలనను అంతమొందించడానికి టిడిపి-జనసేన-బిజెపి కూటమి. ల్యాండ్, శ్యాండ్,వైన్, మైన్ ద్వారా జగన్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారు. ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బంది పెట్టారు. దోపిడీదారులకు సహకరించిన ఏ ఒక్కరినీ కూటమి వదలదు. జూన్ 4వతేదీ కౌంటింగ్ తర్వాత దేశానికి 3వసారి ప్రధానిగా మోడీ, ఎపిలో చంద్రబాబు సిఎంగా ప్రమాణం చేస్తారు. కూటమి కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వైసిపి పాలకులకు తగిన గుణపాఠం తప్పదు. రాబోయే ఎన్నికల్లో వైసిపికి సింగిల్ డిజిట్ స్థానాలు కూడా రావు.