Suryaa.co.in

Andhra Pradesh

జగన్, అతని పార్టీ గాలివాటంలో పుట్టుకొచ్చిన పిచ్చిమొక్కలు

జగన్ అతని మంత్రుల ఉడత ఊపులకు టీడీపీ వణకదు.. బెణకదు
• జగన్, సజ్జల, విజయసాయి, వై.వీ.సుబ్బారెడ్డిలు రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న దుష్టచతుష్టయం.
• మంత్రి జోగిరమేశ్.. మాజీమంత్రి అనిల్ కుమార్ లు లోకేశ్ యాత్రకు వచ్చిచూస్తే యాత్రలో జనంఉన్నారో లేదో తెలుస్తుంది
– యువగళం పాదయాత్ర ప్రదేశంలో (చంద్రగిరి) టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు

“యువగళం పాదయాత్ర 400కిలోమీటర్లు పూర్తయింది. ప్రతి 30కిలోమీటర్లకు ఒకకేసు చొప్పున ఈప్రభుత్వం లోకేశ్ పై 12తప్పుడు కేసులు పెట్టింది. వాటిలో 10కేసులు పోలీసులు పెట్టినవే. లోకేశ్ సహా, ఇతరటీడీపీనేతలపై తప్పుడుకేసులు పెట్టడానికి జగన్ రెడ్డి దళిత పో లీసుల్నే పావులుగా వాడుకుంటున్నాడు. దళిత పోలీసులు ఈవిషయం గమనించాలి. లోకేశ్ టీడీపీ పోలీసులకు వ్యతిరేకంకాదు. జగన్ రెడ్డి ఆదేశాలే రాజ్యాంగంగా భావించే పోలీస్ అధికా రుల్ని తాము తప్పుపడుతున్నాం. లోకేశ్ ఎక్కడా ఎవరికీ ఇబ్బంది లేకుండా ప్రజలసమస్య లు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

తెలుగుదేశంపార్టీకి సవాళ్లు విసిరే స్థాయి జగన్ కు లేదు…
తెనాలిలో జగన్ రెడ్డి హావభావాలు, అరుపులు, కేకలు, సవాళ్లు పులకేశిని గుర్తుచేశాయి. 175 స్థానాల్లో సొంతంగా పోటీచేసే దమ్ముందా అని టీడీపీని ప్రశ్నిస్తున్నజగన్ రెడ్డి.. గతంలో తనతండ్రి ఎవరితో పొత్తులుపెట్టుకొని, ఎవరి పార్టీలను అడ్డంపెట్టుకొని అధికారంలోకి వచ్చాడో గుర్తుచేసుకుంటే మంచిది. తెలుగుదేశంపార్టీ చరిత్ర 40ఏళ్లు. అది పుట్టినప్పుడు జగన్ ఎక్క డో లాగులేసుకొని తిరిగిఉంటాడు. జగన్, అతనిపార్టీ గాలివాటంగా పుట్టుకొచ్చింది. అదొక పిచ్చిమొక్క. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న దుష్టచతుష్టయం.. జగన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వై.వీ.సుబ్బారెడ్డిలు. వారిని ఎప్పుడెప్పుడు రాష్ట్రం నుంచి తరిమికొడదా మా అని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు.

భారీ భవనాలు.. రాజప్రాసాదాలు.. 4లక్షలకోట్ల ఆస్తులున్న జగన్ రెడ్డి పేదవాడా?
తెనాలిసభలో ముఖ్యమంత్రి వీరావేశం..వచ్చేఎన్నికల్లో తనకు పట్టబోయే దుర్గతిని ప్రజలకు చూపింది. రాష్ట్రంలో నిజమైన పెత్తందారీ, జమీందారీ జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి వచ్చేఎన్నికలు పెత్తందార్లకు పేదలకు మధ్య జరుగుతున్నాయని చెప్పడం హాస్యా స్పదం. ఇడుపులపాయ, పులివెందుల, తాడేపల్లి, హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలలో భారీభవనాలు, రాజప్రసాదా లు, 4లక్షలకోట్ల ఆస్తులున్న జగన్ రెడ్డి పేదవాడా.. పెత్తందారా? తనపేరిట చిల్లిగవ్వలేకుండా మొత్తం రాష్ట్రఖజానాకు జమచేశాక, జగన్ ఆమాట అంటే బాగుంటుంది. తాడేపల్లి నుంచి 26కిలోమీటర్ల దూరంలో ఉన్న తెనాలికి హెలికాఫ్టర్లో వెళ్లిన జగన్ పేదవాడా.. పెత్తందారా? వచ్చేఎన్నికల్లో ఓటమితప్పదన్న భయంతోనే జగన్ రెడ్డి తెనాలిసభలో వీరావేశంతో ఊగిపో యాడు. 175 నియోజకవర్గాల్లో పోటీచేయడానికి, టీడీపీ అభ్యర్థుల్నే బరిలో నిలపడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు.. ఇప్పటికిప్పుడు జగన్ అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళ్లగ లడా? వచ్చేఎన్నికల్లో జగన్ పార్టీతరుపున పోటీచేయడానికి అభ్యర్థులే దొరకని దుస్థితి వచ్చేసింది. ఆ విషయం జగన్ తెలుసుకుంటే మంచిది. పోలీసుల సాయంతో, పరదాలచాటున దాక్కొని పెళ్లిళ్లకు హాజరయ్యే జగన్ సింహమా? తెలుగుదేశం పార్టీ పొత్తులుపెట్టుకుంటే జగన్ కు వచ్చిన నష్టమేమిటి? ప్రభుత్వకార్యక్రమంలో రైతులు వారిసమస్యలు గురించి మాట్లాడా ల్సిన జగన్ .. తనసభనుంచి జనం వెళ్లిపోతుండటంతో .. తాను సింహాన్ని.. పేదవాణ్ణి అని రాగాలు అందుకున్నాడు.

జగన్ రెడ్డి ఉత్తరకుమార ప్రగల్భాలు.. జోగిరమేశ్, అనిల్ కుమార్ లాంటి వాళ్ల ఉడత ఊపులు లోకేశ్ ను అడ్డుకోలేవు
జోగిరమేశ్.. మాజీమంత్రి అనిల్ కుమార్ లకు టీడీపీ దమ్ముతో పనేమిటి? వారిస్థాయి ఏమిటో వారు తెలుసుకుంటే మంచిది. అనిల్ కుమార్ ను నెల్లూరు నుంచి తరిమేయడానికి వైసీపీలోని రెడ్డివర్గం సిద్ధమైంది. తనబతుకేంటో తెలుసుకోకుండా అనిల్.. చంద్రబాబుని అం టే, తామే అతన్ని రాష్ట్రంనుంచి తరిమికొడతాం. మంత్రి జోగిరమేశ్ కు తనశాఖలో ఏం జరుగు తుందో తెలుసా? రమేశ్.. ముందునువ్వు, సజ్జలకొడుకు భార్గవ్ రెడ్డి చేసే వీడియోలు చూసి నవ్వుకోవడం ఆపి.. లోకేశ్ యాత్రలోకి వచ్చిచూడు. అక్కడ జనంఉన్నారో.. నీ పోలీసులు న్నారో తెలుస్తుంది. యువగళం యాత్రలో తానుఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చడానికి లోకేశ్ కంకణబద్ధుడయ్యాడు. జగన్ రెడ్డి ఉత్తరకుమార ప్రగల్భాలకు, అతని మంత్రులు, వైసీపీనేత ల ఉడతఊపులకు లోకేశ్, చంద్రబాబులు భయపడరు. ప్రభుత్వం ఎన్నికుట్రలుచేసినా, మంత్రులు ఎన్నికారుకూతలు కూసినా యువగళం పాదయాత్ర ఆగదు.”

LEAVE A RESPONSE